గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ కేసులో కొత్త ట్విస్ట్

గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ కేసులో కొత్త ట్విస్ట్
x
Highlights

గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ కేసులో.. కాంట్రవర్శీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు మళ్లీ నోటీసులు పంపేందుకు రెడీ అవుతున్నారు. జీఎస్టీ...

గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ కేసులో.. కాంట్రవర్శీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు మళ్లీ నోటీసులు పంపేందుకు రెడీ అవుతున్నారు. జీఎస్టీ మూవీ హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్లోనే జరిగినట్లు తాజాగా కంప్లైంట్ రావడంతో.. కేసు కొత్త టర్న్ తీసుకోనుంది.

జీఎస్టీ మూవీలో అసభ్యత, అశ్లీలత ఉందన్న అభియోగాలు, సామాజిక కార్యకర్త దేవిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా వర్మపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరిలో ఆయనను విచారించి.. సెల్‌ఫోన్, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. ఆధారాలు, సాక్ష్యాల కోసం వాటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు.

అప్పటి విచారణలో.. జీఎస్టీని తాను డైరెక్ట్ చేయలేదని.. స్కైప్ ద్వారా సూచనలు మాత్రమే చేశానని వర్మ సీసీఎస్ పోలీసులకు తెలిపారు. జీఎస్టీని పోలెండ్‌లో షూట్ చేసినట్లు వివరించారు. కానీ.. షూటింగ్ హైదరాబాద్‌లోనే జరిగిందని.. మియా మాల్కోవాను సిటీకి రప్పించారని కంప్లైంట్ రావడంతో.. సీసీఎస్ పోలీసులు వర్మకు మళ్లీ నోటీసులు పంపేందుకు రెడీ అవుతున్నారు. ఆయన పోలెండ్.. వెళ్లారా.. లేదా.. అని నిర్ధారించేందుకు పాస్‌పోర్ట్‌ను పరిశీలించనున్నారు. ఇక.. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక కూడా ఈ కేసులో కీలకం కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories