ఫొటోకు పోజిచ్చి వివాదంలో చిక్కుకున్న మోడల్

Submitted by arun on Fri, 03/02/2018 - 14:42
gilu joseph

మోడల్ గిలు జోసెఫ్ వివాదంలో చిక్కుకుంది. మలయాళ మ్యాగజైన్ ‘గృహలక్ష్మి’ కవర్‌పేజ్‌ కోసం బిడ్డకు పాలిస్తున్నట్లు గిలు జోసెఫ్ ఓ ఫొటోకు పోజిచ్చింది. బిడ్డకు బహిరంగంగా పాలిస్తే తప్పేంటని మ్యాగజైన్ చేపట్టిన క్యాంపెయిన్‌కు ఆమె మద్దతుగా నిలవడంతో ఆ ఫొటోను కవర్‌పేజ్‌పై ప్రచురించారు.  ఈ ఫొటోపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం నెలకొంది. ఉద్దేశం మంచిదైనా పెళ్లికాని జోసెఫ్‌ ఫొటోను ముద్రించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కవర్‌ పేజీపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వినోద్‌ మాథ్యూ అనే కేరళ న్యాయవాది మహిళల అసభ్య ప్రాతినిధ్య (నిషేధం) చట్టం, 1986 కింద మ్యాగజైన్‌ పబ్లిషర్‌, మోడల్‌ జోసెఫ్‌లపై ఫిర్యాదు చేశారు.

మోడల్‌ జోసెఫ్‌ పాలిస్తున్న కవర్‌పేజీపై ‘మేం పాలిస్తున్నాం.. తదేకంగా చూడకండి.. అని తల్లులు కేరళకు చెబుతున్నారు’ అనే క్యాఫ్షన్‌తో సదరు పబ్లిషర్‌ మ్యాగజైన్‌ను గురువారం విడుదల చేశారు. తల్లులు బహిరంగంగా శిశువులకు పాలు ఇవ్వడంలో తప్పులేదన్న అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని మ్యాగజైన్‌ ఎడిటర్‌ పేర్కొన్నారు.
 

English Title
Grihalakshmi magazine faces legal case for featuring breastfeeding model on its cover

MORE FROM AUTHOR

RELATED ARTICLES