కుప్పకూలిన గౌలిగూడ బస్టాండ్‌

Submitted by arun on Thu, 07/05/2018 - 16:26
GowliGuda

హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం తప్పింది. గౌలిగూడలోని పాత సీబీఎస్‌ బస్టాండ్‌ పైకప్పు కుప్పకూలిపోయింది.  ఆర్టీసీ అధికారుల అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. బస్టాండ్ షెడ్ కూలిపోయే స్థితిలో ఉన్నట్లు నాలుగు రోజుల క్రితమే అధికారులు గుర్తించారు. దీంతో ముందస్తు చర్యగా అధికారులు బస్సులను లోపలికి అనుమతించలేదు. బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రయాణికులను కూడా అప్రమత్తం చేశారు. భారీ శబ్ధంతో కుప్పకూలడంతో అక్కడున్న ప్రజలు ఆందోళనకు గురయ్యారు. లోపల ఎవరూ లేకపోవడంతో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. 

English Title
gowliguda-bus-station-crashed-down

MORE FROM AUTHOR

RELATED ARTICLES