తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకెళ్తోంది: గవర్నర్‌

తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకెళ్తోంది: గవర్నర్‌
x
Highlights

సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ నరసింహన్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనాన్ని...

సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ నరసింహన్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనాన్ని గవర్నర్‌ స్వీకరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి గవర్నర్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ.. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకెళ్తోందని కితాబిచ్చారు. జాతీయ సగటు కంటే మిన్నగా 18 శాతం వృద్ధి రేటుతో పరుగులు పెడుతోన్న తెలంగాణ దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నదని గవర్నర్‌ నరసింహన్‌ చెప్పారు. అన్నిటికి అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించిందన్నారు.

తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని, బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నామని గవర్నర్‌ చెప్పారు. విద్యుత్‌ రంగంలో గణనీయమైన వృద్ధి సాధించామన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ ఇస్తున్నామని, ఎకరాకు రూ. 4వేలు చొప్పున పెట్టుబడి సమకూర్చబోతున్నామని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ రూపకల్పన చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో భూ రికార్డుల ప్రక్షాళన పూర్తయిందని, త్వరలో రైతులకు కొత్త పాస్‌పుస్తకాలు ఇస్తామన్నారు. కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్ట్‌ల పనులు వేగంగా జరుగుతన్నాయని, కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని నరసింహన్‌ వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories