హీరొయిన్ మేకప్ లేకుండా..

Submitted by arun on Tue, 10/30/2018 - 17:40
gorantha deepam movie

హీరొయిన్ మేకప్ లేకుండా..సినిమాల్లో నటించడం.. చాల అరుదు... అలా జరిగిన చిత్రం... గోరంతదీపం.  ఇది 1978లో విడుదలైన ఒక తెలుగుచిత్రం. ముత్యాలముగ్గు తరువాత బాపు, శ్రీధర్ ను హీరోగా తీసిన చిత్రం.ఘండికోట బ్రహ్మాజీరావు వ్రాసిన "ఒక దీపం వెలిగింది" నవల ఆధారంగా ఈ చిత్రం తీయబడింది. ఈ చిత్రంలో వాణిశ్రీ మేకప్ లేకుండా నటించింది. మోహన్ బాబు నుంచి, అత్తమామల నుంచి వాణిశ్రీ తనను తాను రక్షించుకోవడం చిత్రకథ. వాణిశ్రీ తండ్రిగా కాంతారావు నటించారు. చిత్రంలో కాంతారావుకు రాసిన సంభాషణలు గమనించదగ్గవి. ('నువ్వుతిన్న ఆహారాన్ని నువ్వే జీర్ణంచేసుకోవాలి', 'నువ్వు సుఖదుఖాలకు నువ్వేబాధ్యత వహించాలి' వంటివి.) పాటలలో కొన్ని'రాయినైనా కాకపోతిని', 'గోరంతదీపం కొండంత వెలుగు'. మోహన్ బాబుకు కొన్ని చరణాలు పి.బి.శ్రీనివాస్ పాడటం విశేషం. మీకు ముత్యాలముగ్గు సినిమా నచ్చి వుంటే... ఈ సినిమా కూడా చూడవచ్చు. శ్రీ.కో.

English Title
gorantha deepam movie

MORE FROM AUTHOR

RELATED ARTICLES