నువ్వేమైనా రామ్ చరణ్ అనుకుంటున్నావా?: అడవి శేష్‌తో బడా ప్రొడ్యూసర్

Submitted by arun on Mon, 08/06/2018 - 17:34
adivi sesh

 ‘క్షణం’ వంటి సూపర్ హిట్ చిత్రం తరువాత అడివి శేష్ హీరోగా నటించిన చిత్రం ‘గూఢచారి’ ఈ శుక్రవారం విడుదలై విజయవంతమైన చిత్రంగా నిలిచింది. పాజిటివ్ టాక్‌లో హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో నడుస్తుండంతో విజయోత్సవాల్లో తేలుతోంది చిత్ర యూనిట్. శోభిత ధూళిపాళ్ల హీరోయిన్‌గా అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, విస్టా డ్రీం మర్చెంట్స్ బ్యానర్స్‌పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అభిషేక్ నామ, టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ‘గూఢచారి’ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకున్నాడు శేష్.
 
‘‘క్షణం మూవీ తర్వాత 50 పైగా సినిమాల ఆఫర్లు వచ్చాయి. కానీ నేను వాటన్నింటికి నో చెప్పాను. దీనికి కారణం నేనేదో గొప్ప అని అనుకుని కాదు. నచ్చితే చేసేస్తాం. నచ్చకపోతే చెయ్యం అంతే. ఓ పెద్ద ప్రొడ్యూసర్ నన్ను తిట్టారు. ‘నువ్వేమైనా రామ్ చరణ్ అనుకుంటున్నావా? వెలుగు కొంతకాలమే ఉంటుంది. కొంచెం చూసుకో’ అని. అప్పుడు నేను అదేం లేదు సార్. మీరు నాకు ఇవ్వకపోతే పర్లేదు సార్. నచ్చిన సినిమానే చేసుకుంటా అని జెన్యూన్‌గా సమాధానం చెప్పాను. ఆయనకు కోపం వచ్చిందని నేనేం బాధ పడలేదు. మనకు నచ్చిన సినిమా మాత్రమే చెయ్యాలి అని. ఒకటి మనకు నచ్చిన సినిమా ఆడకపోతే ఓకే మనకు నచ్చిన పని చేశాములే సమాధానం చెప్పుకోవచ్చు. అదే నచ్చని సినిమా చేసి అది ఆడలేదంటే.. అంతకన్నా బ్యాడ్ ఇంకోటి ఉండదు’’ అని చెప్పుకొచ్చాడు శేష్.

English Title
The Goodachari team thanks the audience

MORE FROM AUTHOR

RELATED ARTICLES