పసిడి కొనుగోళ్లు.. గతేడాదికంటే 15.4 టన్నులు తక్కువ..!

Submitted by admin on Thu, 08/02/2018 - 16:30
gold has lesser down by 15.4 tons

అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజన్లలో కూడా భారత్ లో బంగారం కొనుగోళ్లు తగ్గాయి. ధరల పెరుగుదల, స్థానిక పరిస్థితులు  మార్కెట్ పై ప్రభావం చూపాయి. గతేడాదితో పోల్చుకుంటే ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో దాదాపు 15.4టన్నల బంగారం కొనుగోళ్లు తగ్గింది. ఈ త్రైమాసికం ఆరంభంలో కొనుగోళ్లు ఉత్సాహంగానే సాగినా.. అధిక మాసం కారణంగా మందగించాయి. ఈ మేరకు.. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) ఓ నివేదికలో పేర్కొంది.

ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా బంగారం క్రయవిక్రయాలపై గోల్డ్‌ డిమాండ్‌ ట్రెండ్స్‌ క్యూ2 2018 పేరుతో డబ్ల్యూజీసీ నివేదిక రూపొందించింది. భారత్ లో గతేడాది ఇదే త్రైమాసికంలో 202.6 టన్నుల పసిడి విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది మాత్రం 187.2టన్నుల కొనుగోళ్లు జరిగాయి. అంటే దాదాపు 8శాతం వ్యత్యాసం. అయితే నగదు పరంగా తీసుకుంటే.. గతేడాది రూ.52,692కోట్ల బంగారాన్ని ప్రజలు కొనగులు చేశారు. ఈ ఏడాది 52,750కోట్లుగా ఉంది. ధరలు పెరగడంతో తక్కు బంగారం కొనుగోలు జరిగినా... నగదు పరంగా ఈ ఏడాదే ఎక్కువగా ఉంది. అయితే 2018 ద్వితీయార్థంలో పండగ సీజన్లు, వర్షాలు సక్రమంగా పడటం వంటి కారణాల వల్ల బంగారం కొనుగోళ్లు పెరిగి అవకాశం ఉందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

English Title
gold has lesser down by 15.4 tons

MORE FROM AUTHOR

RELATED ARTICLES