రెచ్చిపోయిన ప్రేమోన్మాది… ఒంటికి నిప్పంటించుకొని యువతి ఇంట్లోకి

Submitted by nanireddy on Sat, 10/06/2018 - 16:31
the-girl-refused-to-marry-man-set-fire

హైదరాబాద్ లో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు.. యువతి తనతో పెళ్లికి నిరాకరించిందన్న కారణంతో ఏకంగా అమ్మాయి ఇంట్లోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో ఇంట్లో ఉన్న యువతి కుటుంబసభ్యులకు ఆ నిప్పంటుకుని తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇదిలావుంటే ఈ దారుణానికి పాల్పడింది ఇబ్రహీం అనే పెళ్ళైన వ్యక్తి అని తెలుస్తోంది. అతనికి ఇదివరకే ఇద్దరు సంతానం. గతకొంత కాలంగా ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానంటూ బార్కస్ లో నివసించే ఓ యువతి వెంటపడుతున్నాడు. .ఈ విషయం సదరు యువతి కుటుంబసభ్యులకు తెలిసి అతడిని మందలించారు. పెళ్లికి నిరారించడంతో పాటు పోలీస్‌ స్టేషన్‌లో అతగాడిపై ఫిర్యాదు చేశారు. దీంతో ఇబ్రహీం ఈ దురాగతానికి పాల్పడ్డాడు.  

English Title
the-girl-refused-to-marry-man-set-fire

MORE FROM AUTHOR

RELATED ARTICLES