నిర్భయ కంటే దారుణమైన ఘటన..

Submitted by arun on Mon, 01/15/2018 - 11:19
haryana

ఢిల్లీ నిర్భయ కంటే దారుణమైన అత్యాచార ఘటన హరియాణాలో చోటు చేసుకుంది. హర్యానాలోని కురుక్షేత్రలో ఈ ఘటన వెలుగు చూసింది. ఓ దళిత బాలికపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి.. హత్య చేశారు. కురుక్షేత్రలో జనవరి 9న ఓ దళిత బాలిక అదృశ్యమైంది. మరుసటి రోజు జింద్ జిల్లాలోని ఓ గ్రామానికి సమీపంలో ఉన్న కెనాల్ వద్ద  శవమై తేలింది. బాలిక మృతదేహాన్నిపోలీసులు స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం రోహతక్ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి ముఖం, ఛాతీ, మెడపై బలమైన గాయాలు అయ్యాయి. శరీరంపై 19 గాయాలు ఉన్నట్లు తేలింది. కామాంధులను కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు. 

English Title
girl rape and murdered

MORE FROM AUTHOR

RELATED ARTICLES