దళితున్ని పెళ్లి చేసుకుందని కోర్టు ఆవరణలోనే..

Submitted by arun on Fri, 08/10/2018 - 16:04
father kills daughter

పంజాబ్‌లో ఘోరం చోటుచేసుకుంది. దళిత యువకున్ని పెళ్లిచేసుకుందని అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురుని కాల్చిచంపాడో కసాయి తండ్రి. ఈ ఘటన రోహ్‌తక్‌ కోర్టు ప్రాంగణంలో చోటుచేసుకోవడం గమనార్హం. కాగా, ఆమెకు రక్షణగా ఉన్న పోలీస్‌ ఇన్స్‌పెక్టర్‌ కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. హర్యానాలోని రోహ్‌తక్‌ పట్టణంలో నివాసముండే రమేష్ దంపతులకు పిల్లలు కలగక పోవడంతో తమ బందువుల అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆమెకు మమత అని పేరుపెట్టి చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అయితే మమత అదే ప్రాంతానికి చెందిన సోంబీర్ అనే దళిత యువకున్ని ప్రేమించింది. వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు.

అయితే మమత ఇంకా మైనర్ కావడంతో రమేష్ తన కూతురిని సోంబేర్ కిడ్నాప్ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సోంబీర్ ను అరెస్ట్ చేశారు. అయినప్పటికి మమత ఇంటికి రాకుండా సోంబీర్ ఇంట్లోనే ఉంటోంది. ఇవాళ సోంబీర్ ను రోహ్‌తక్ కోర్టులో హాజరుపర్చారు. అయితే ఇక్కడికి వచ్చిన కూతురుని చూడగానే ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన తండ్రి రమేష్ నిన్ను మరికొద్దిసేపట్లో చంపేస్తానని బెదిరించాడు. అయితే అతడు కోపంలో అలా అంటున్నాడని అందరూ భావించారు. కానీ అతడె అలా అన్న కొద్దిసేపటికే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి కోర్టు ఆవరణలోనే మమతను తుపాకీతో కాల్చి చంపారు. ఆమెను కాపాడటానికి ప్రయత్నించిన స్థానిక ఎస్సైపై కూడా కాల్పులు జరపడంతో అతడు కూడా మృతిచెందాడు.
 

English Title
Girl 'killed by father' in Rohtak for marrying Dalit was adopted

MORE FROM AUTHOR

RELATED ARTICLES