ప్రేమ వివాహం చేసుకుందని గుండు గీయించారు!

Submitted by arun on Wed, 01/24/2018 - 11:59

వరంగల్‌ అర్బన్‌ జిల్లా హసన్‌‌పర్తిలో దారుణం జరిగింది. ప్రేమ పెళ్లి చేసుకుందని కన్నకూతురుపైనే తల్లిదండ్రులు కర్కశత్వానికి ఒడిగట్టారు. కూతుర్ని కిడ్నాప్‌‌ చేసి అత్యంత అమానవీయంగా గుండు గీయించారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న హసన్‌పర్తి పోలీసులు యువతి తల్లిదండ్రులు, సోదరులు, వదినలను అదుపులోకి తీసుకున్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన ప్రవీణ్‌, బాధిత యువతి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇది నచ్చని యువతి తల్లిదండ్రులు కన్నకూతురినే కిడ్నాప్‌‌చేసి కర్కశంగా ప్రవర్తించారు. 

English Title
a girl attacked her parents love marriage

MORE FROM AUTHOR

RELATED ARTICLES