ఆజాద్‌ టూర్‌పై టీకాంగ్రెస్‌ భారీ ఆశలు

Submitted by santosh on Wed, 09/12/2018 - 12:37
Ghulam Nabi Azad

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలను ఆజాద్ సెట్ చేయబోతున్నారా? ప్రస్తుత రాజకీయాలపై ఆయన దృష్టి పెట్టనున్నారా? ఆజాద్‌ రాకతో అంతా సెట్‌ అవుతుందా? ఇంతకీ ఆజాద్ రాకకు ప్రధాన ఉద్దేశమేంటి? 

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణపై కాంగ్రెస్‌ అధిష్టానం దృష్టిపెట్టింది. పార్టీ ట్రబుల్‌ షూటర్‌గా పేరు తెచ్చుకున్న ఆజాద్‌ను రంగంలోకి దించుతోంది. ఇటీవల కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తేవడంతో కీలక పాత్ర పోషించిన ఆజాద్‌ తెలంగాణలోనూ కీ రోల్‌ పోషించబోతున్నారు. ఇప్పటికే మహా కూటమి దిశగా హస్తం పార్టీ ప్రయత్నాలు చేస్తుండటంతో ఆజాద్‌ రాక... కూటమిని సెట్‌ చేయడానికేనన్న చర్చ గాంధీభవన్‌లో జోరుగా సాగుతోంది. అంతేకాదు పార్టీ ముఖ్యనేతల మీటింగ్‌లో కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. హైదరాబాద్‌ పర్యటనలో బిజీబిజీగా గడపనున్న ఆజాద్‌.... సంగారెడ్డిలో జరగనున్న మైనారిటీ సమావేశంలో పాల్గోనున్నారు. ఆజాద్‌ రాకతో తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్‌ వస్తుందని నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు.

English Title
Ghulam Nabi Azad visit to Telangana

MORE FROM AUTHOR

RELATED ARTICLES