పన్ను వసూళ్ళపై జీహెచ్‌ఎంసీ దృష్టి

x
Highlights

బల్దియా ఆదాయంపై ఫోకస్ పెట్టారు జీహెచ్ఎంసీ అధికారులు. అసెంబ్లీ ఎన్నికల్లో బిజీబిజీగా గడిపిన గ్రేటర్ అధికారులు పన్నుల వసూళ్లపై దృష్టి మళ్లించారు....

బల్దియా ఆదాయంపై ఫోకస్ పెట్టారు జీహెచ్ఎంసీ అధికారులు. అసెంబ్లీ ఎన్నికల్లో బిజీబిజీగా గడిపిన గ్రేటర్ అధికారులు పన్నుల వసూళ్లపై దృష్టి మళ్లించారు. గ్రేటర్ ఆదాయాన్ని భర్తీ చేసేందుకు కసరత్తు మొదలు పెట్టారు. టాక్స్ వసూళ్ల కోసం టార్గెట్లు ఫిక్స్ చేశారు. మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లో క్షణం తీరిక లేకుండా గడిపిన జీహెచ్ఎంసీ యంత్రాంగం నిలిచిపోయిన పన్నుల వసూళ్లకు కసరత్తు ముమ్మరం చేసింది. ప్రధానంగా జీహెచ్ఎంసీకి రావాల్సిన ప్రాపర్టీ టాక్స్ వసూలు మొదలు కొని ఇతర బిల్లుల వసూళ్లపై ఫోకస్ పెట్టారు. ప్రతి ఏడాది జనవరి వస్తుందంటే డే టూ డే కలెక్షన్లపై ప్రత్యేక చర్యలు చేపడుతుంది జీహెచ్ఎంసీ. అయితే మూడు నెలుగా అసెంబ్లీ ఎన్నికల నిర్వాహణలో బిల్ కలెక్టర్ నుంచి కమిషనర్ వరకు అంతా నిమగ్నమయ్యారు. గడిచిన మూడు నెలుగా జీహెచ్.ఎంసీకి రావాల్సిన కనీస వసూళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బల్దియా ఖజానా వెలవెలబోయింది. ఇది గ్రహించిన జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి మళ్లించారు.

గత ఏడాది 13 వందల కోట్ల ఆస్తి పన్ను వసూలు చేసిన జీహెచ్ఎంసీ ఈ ఏడాది 15 వందల కోట్ల పన్ను వసూలు చేయాలని టార్గెట్ గా నిర్ణయించింది. అయితే ఎన్నికల కారణంగా టార్గెట్ సగం మాత్రమే రీచ్ అయ్యారు. మార్చి నెలలో 200 నుంచి 300 కోట్లు వసూలు అవుతోందని అంచనా వేస్తున్నారు. మిగిలిన రెండు నెలల 15 రోజుల్లో 450 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పన్నుల వసూళ్లపై స్పెషల్ కాన్సట్రేషన్ చేసిన ఉన్నతాధికారులు జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, టాక్స్ ఇన్స్పెక్టర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. గ్రేటర్ పరిధిలో ఎక్కడెక్కడి నుంచి ఎక్కువ మొత్తంలో టాక్స్ పెండింగ్ లో ఉన్నాయి. ఎవరెవరు ఎంత వసూలు చేయాలనే అంశాలపై క్షేత్ర స్థాయిలో లెక్కలు వేసి వసూళ్లు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. అంతేకాకుండా కమర్షియల్ ఎస్టాబ్లిష్ మెంట్స్ నుండి వచ్చే ట్రేడ్ లైసెన్స్ ఫీజు వసూళ్లలో మెడికల్ అధికారులకు కూడా టార్గెట్ల్ ఫిక్స్ చేశారు. ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకొని టాక్స్ కలెక్షన్ చేయాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. సిటిజన్స్ చెల్లించాల్సిన మరో యాబై శాతం పన్నులు వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.

గ్రేటర్ ప‌రిధిలో 14ల‌క్ష‌ల 72వేల‌మంది ఆస్తిపన్ను చెల్లింపులుదారులు ఉన్నారు. వీటిలో క‌మ‌ర్సియ‌ల్ ఎస్టాబ్లిస్ మెంట్స్ 2లక్ష‌ల 40వేలు కాగా రెసిడెన్సీయ‌ల్, క‌మ‌ర్షియ‌ల్ ఆస్తులు కలిగిన వారు 20 వేలమంది ఉన్నారు. ఏరియర్స్, వడ్డీ కలిపి వసూలు చేసినట్లయితే GHMC కి దాదాపు రెండు వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరనున్నది.

Show Full Article
Print Article
Next Story
More Stories