విసుగుతో 106మంది రోగల ప్రాణాలు తీసిన నర్స్

Highlights

వృత్తిపరంగా విసిగిపోయిన ఓ నర్స్ 106మంది రోగల ప్రాణాలు తీసింది. విసుగు చెందితే ఇలా ప్రాణాలు తీస్తారా..? అనే అనుమానం రావచ్చు. కాదనలేం. ఎందుకంటే దీనికి...

వృత్తిపరంగా విసిగిపోయిన ఓ నర్స్ 106మంది రోగల ప్రాణాలు తీసింది. విసుగు చెందితే ఇలా ప్రాణాలు తీస్తారా..? అనే అనుమానం రావచ్చు. కాదనలేం. ఎందుకంటే దీనికి రకరకలా కారణాలున్నాయని వైద్యులు చెబుతున్నారు.
కొంతమంది విసుగుతో చచ్చిపోతున్నాం అని బాధపడుతుంటారు. నిజానికి విసుగు అనేది మనసుకు సంబంధించినది. మనసు గత జ్ఞాపకాలపై ఆధారపడి పనిచేస్తోంది కాబట్టే ఈ తిప్పలు. మన మనసులో నుంచి పుట్టే ఊహలు,గత జ్ఞాపకాలతోనే జీవితం నడుస్తుంది. జరిగిన జ్ఞాపకాలకు పునర్జీవమిస్తుంది మనసు. నిన్న జరిగిన సంఘటనలను గుర్తుతెచ్చుకోవడం మళ్ళీ ఆ సంఘటనను గుర్తుకు తెచ్చుకోవడమే . అలా చేసిన పనినే మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడంతోనే విసుగు మొదలవుతుంది.
ఇలా విసుగు అనిపించినప్పుడు మనసుని మరోపనిపై లగ్నం చేయడం, యోగా చేయడం ద్వారా అరికట్టవచ్చు. అలా చేయలేదంటే మీరు మీ మనసుకి పూర్తిగా బానిసై..అది ఏం చేయమంటే మీరు అది చేస్తారు. ఒక్కసారి ఇలాగే కొనసాగితే మీ మనసు మిమ్మల్ని పూర్తిగా పతనం చేస్తుంది. ఒక్కసారి అలా పతనం అయితే కంట్రోల్ చేయడం చాలా కష్టం.

అలా జర్మనీలోని డెల్మెన్‌ హోస్ట్‌ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోన్న నీల్స్ హోగెల్ (41) వృత్తి పరంగా విసిగిపోయింది. దీంతో తనలోని అసహనాన్ని రోగులపై ప్రదర్శించింది. ఇలా ఏకంగా 106మంది రోగుల ప్రాణాలు తీయడం సంచలనమైంది.
ఎవరికి అనుమానం రాకుండా రోగులకు ప్రాణాంతక మందులు ఇంజెక్ట్‌ చేసి చంపేసేంది. డెల్మెన్‌హోస్ట్‌ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసే నీల్స్ హోగెల్... వైద్యం ముసుగులో హత్యలకు పాల్పడుతుందని ఆరోపణలు రావడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు దిమ్మతిరిగే నిజాలు పడ్డాయి. ఆలస్యంగా వెలుగు చూసిన నర్సు నిర్వాకం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.
2015లో ఇద్దరి రోగులను హత్య చేయడంతో పాటు మరో ఇద్దరిపై హత్యాయత్నం జరిపిందన్న కేసులో నీల్స్ హోగెల్ ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయస్థానం ఆమెకు జీవిత ఖైదు శిక్షను విధించింది. నర్సు వ్యవహారంపై అనుమానం ఉందని మరోసారి దర్యాప్తు చేయాలని బాధితులు కోరారు. దీంతో మరోసారి దర్యాప్తు చేసిన పోలీసులు..మరో 16 మందిని హతమార్చినట్టు గుర్తించారు. వైద్యం పేరుతో మొత్తం 106 మందిని హతమార్చిందని నిర్ధారించారు.
నీల్స్ హోగెల్ ఈ హత్యలన్నీ 1999 నుంచి 2005 మధ్యకాలంలో చేసినట్టు పోలీసులు తెలిపారు. 2005లో ఒక రోగికి ప్రాణాంతక మందు ఇంజెక్ట్ చేస్తుండగా చూసిన మరోనర్సు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు బాగోతం బయటపడింది. వైద్యం అంటే విసుగు చెంది వారందర్నీ చంపేసినట్టు నర్సు ఒప్పుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories