‘గీత గోవిందం’ సీన్లు లీక్.. సూత్రధారి అరెస్ట్

x
Highlights

అంతా ఓకే అనుకుంటున్న టైంలో.. టాలీవుడ్‌లో మళ్లీ ప్రకపంనలు రేగాయ్. రిలీజ్‌కు ముందే టాలీవుడ్‌కు మళ్లీ లీక్ షాక్ తగిలింది. సినిమా హాల్‌లో కంటే ముందే లీకు...

అంతా ఓకే అనుకుంటున్న టైంలో.. టాలీవుడ్‌లో మళ్లీ ప్రకపంనలు రేగాయ్. రిలీజ్‌కు ముందే టాలీవుడ్‌కు మళ్లీ లీక్ షాక్ తగిలింది. సినిమా హాల్‌లో కంటే ముందే లీకు వీరుల సెల్‌లో ఆడేస్తోంది స్టార్ హీరోల మూవీ. ఈ కొంత లీకేజ్ ఇండస్ట్రీకి ఎంతో డ్యామేజ్ చేస్తోంది. అలా లీకుల లిస్ట్‌లో ఈసారి గీత గోవిందం సినిమా వంతొచ్చింది.

టాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాలకు లీకుల షాక్ కొత్తేమీ కాదు. కాకపోతే ఈసారి చాలా గ్యాప్ వచ్చింది. ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో కాస్త హైప్ వచ్చిన సినిమా ఏదైనా ఉందంటే అది గీత గోవిందమే. అందుకే ఇప్పుడీ క్రేజీ ప్రాజెక్ట్ లీకేజ్.. టాలీవుడ్‌ను షాక్‌కు గురిచేసింది. అర్జున్ రెడ్డి మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ గీత గోవిందం. ఆగస్ట్ 15న ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అంతకముందే లీకు వీరుల సెల్‌లో రిలీజైపోయింది. అంతేనా షేరింగ్‌ల మీద షేరింగ్‌లతో ఇప్పటికే చాలామంది సెల్‌ఫోన్లలోకి వెళ్లిపోయింది.

రిలీజ్‌కు ముందే గీతగోవిందం లీకేజ్‌కు గురైందని తెలిసి మూవీ యూనిట్ షాక్‌కు గురైంది. ఫిలింనగర్‌లో డేటా డిజిటల్ బ్యాంక్ అడ్మిన్‌గా పని చేస్తున్న పడవల రాజేష్ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా తేల్చారు పోలీసులు. మూవీ ఎడిటింగ్ కోసం గీతా ఆర్ట్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ ఇచ్చిన హార్డ్ డిస్క్‌ల నుంచి గీతగోవిందం మూవీతో పాటు టాక్సీవాలా సినిమాను కూడా రాజేష్ దొంగతనంగా కాపీ చేసుకున్నాడు. సినిమా లీకైందని తెలుసుకున్న ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 60 శాతం సినిమాను హార్డ్ డిస్క్ ద్వారా దొంగిలించి గుంటూరులోని 2 ప్రైవేట్ ఇంజనీరింగ్ విద్యార్థులకు షేర్ చేసిన పడవల రాజేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి దగ్గర్నుంచి 3 ల్యాప్‌టాప్‌లు, 3 పెన్‌డ్రైవ్‌లు, 2 హార్డ్ డిస్క్లు, 4 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

రిలీజ్ కాని సినిమాలను షేర్ చేయడం చట్టరీత్యా నేరమని విద్యార్థులు గ్రహించాలని పోలీసులు చెప్పారు. గీత గోవిందం మూవీ షేర్ చేసిన నలుగురు విద్యార్థులను కూడా కేసులో నిందితులుగా చేర్చినట్లు తెలిపారు గుంటూరు అర్బన్ ఎస్పీ విజయారావు.
రిలీజ్‌కు ముందే సినిమా లీకవడంతో హీరో విజయ్‌ దేవరకొండ చాలా హర్ట్ అయ్యాడు. తాను చాలా నిరాశకు గురయ్యానని ఒక్కోసారి బాగా కోపం వస్తోందని ఇంకోసారి ఏడుపొస్తోందని.. ట్వీట్ చేశాడు. సినిమా లీకవడంతోనే.. విజయ్ ఈ ట్వీట్ చేశాడని ఫ్యాన్స్‌కు, నెటిజన్లకు అర్థమైంది. ఎన్ని లీకులెదురైనా మనకు బ్లాక్ బస్టర్ గ్యారంటీ అంటూ విజయ్‌కు ధైర్యం చెప్పారు. చిల్ రౌడీ లైట్ తీసుకో అంటూ గోవిందాన్ని ఓదారుస్తున్నారు.

మూవీ ప్రమోషన్‌లో భాగంగా విశాఖకు వెళ్లిన విజయ్ సినిమా లీకేజీపై తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఈ మధ్యకాలంలో టాలీవుడ్‌లో మోస్ట్ అవెయిటెడ్ మూవీ ఏదైనా ఉందంటే.. అది గీత గోవిందమే. ఇంకేం కావాలే.. సాంగ్ ఓ రేంజ్‌లో హిట్ అవడం.. టీజర్ కూడా కూల్‌గా, ఫ్రెష్‌గా ఉండటం, యూత్‌ని బాగా ఎట్రాక్ట్ చేసింది. అందుకే.. ముందుగానే లీక్ చేసి.. ఏదో చేద్దామనుకున్నారు. కానీ.. చివరికి దొరికిపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories