‘గీత గోవిందం‌’ మూవీ రివ్యూ

‘గీత గోవిందం‌’ మూవీ రివ్యూ
x
Highlights

టైటిల్ : గీత గోవిందం జానర్ : రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ తారాగణం : విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న, సుబ్బరాజు, రాహుల్‌ రామకృష్ణ సంగీతం : గోపి...

టైటిల్ : గీత గోవిందం
జానర్ : రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌
తారాగణం : విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న, సుబ్బరాజు, రాహుల్‌ రామకృష్ణ
సంగీతం : గోపి సుందర్‌
దర్శకత్వం : పరశురామ్‌
నిర్మాత : బన్నీ వాస్‌
‘ అర్జున్ రెడ్డి’ సినిమాతో టాలీవుడ్ లో క్రేజీ స్టార్ గా మారిపోయాడు హీరో విజయ్ దేవరకొండ. ఇక తెలుగులో ఛలో సినిమాతో తన నటన, అందంతో అందరినీ ఆకట్టుకుంది రష్మిక మందన్న. వీరిద్దరి కాంబినేషన్ లో డెరెక్టర్ పరశురాం తెరకెక్కించిన చిత్రం ‘ గీతా గోవిందం’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నేడు (ఆగస్టు 15న) ఈ చిత్రం ప్రేక్షకుల ముందకు వచ్చింది.

క‌థ‌: విజ‌య్ గోవిందం(విజ‌య్ దేవ‌ర‌కొండ‌) ఇంజ‌నీరింగ్ కాలేజీ లెక్చ‌ర‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు. అమ్మ చిన్న‌ప్పుడే చ‌నిపోవ‌డంతో.. కాబోయే భార్య‌ను ప్రేమ‌గా చూసుకోవాల‌ని విజ‌య్ గోవిందం అనుకుంటాడు. గుడిలో ఓ అమ్మాయిని చూసి ఇష్ట‌ప‌డ‌తాడు. గోవింద్ చెల్లెలు పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఊరికి వెళ్ల‌డానికి బ‌స్సు ఎక్కిన గోవింద్‌కి బ‌స్సులో త‌ను గుడిలో చూసిన అమ్మాయి తార‌స‌ప‌డుతుంది. ఆ అమ్మాయి పేరు గీత‌(ర‌ష్మిక మండ‌న్న) అనుకోకుండా గీత‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ లిప్ లాక్ పెట్టేస్తాడు. విజ‌య్‌ని త‌ప్పుగా అర్థం చేసుకున్న గీత విష‌యాన్ని అన్న‌కు చెప్పేస్తుంది. గీత అన్న‌య్యే త‌న చెల్లెల‌కు కాబోయే భ‌ర్త అని త‌ర్వాత గోవిందంకు తెలుస్తుంది. అప్పుడు గోవిందం ఏం చేస్తాడు? గీత విజ‌య్ గురించి అన్న ద‌గ్గ‌ర చెప్పేస్తుందా? గోవిందం, గీత ఎలా ప్రేమ‌లో ప‌డ‌తారు? చివరికి వారి క‌థ ఎలాంటి మ‌లుపు తిరుగుతుంద‌నేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ ; ఆంజనేయులు, సోలో, శ్రీరస్తు శుభమస్తు లాంటి సినిమాలతో ఆకట్టుకున్న పరశురామ్‌. మరోసారి తనదైన కామెడీ, ఎమోషనల్‌ టేకింగ్‌తో ఆకట్టుకున్నాడు. పాత కథే అయినా.. కథనం, డైలాగ్స్‌తో ఆడియన్స్‌కు కొత్త అనుభూతిని అందించాడు. విజయ్‌ దేవరకొండను అర్జున్‌ రెడ్డి ఇమేజ్‌ నుంచి బయటకు తీసుకువచ్చి డిఫరెంట్‌ స్టైల్‌లో చూపించటంలో సక్సెస్‌ అయ్యాడు. దర్శకుడిగానే కాదు రచయితగాను ఫుల్‌ మార్క్స్‌ సాధించాడు. కావాలని కామెడీ సీన్స్‌ను ఇరికించకుండా లీడ్‌ క్యారెక్టర్స్‌తోనే మంచి కామెడీ పండించాడు. తొలి భాగం ఎంటర్‌టైనింగ్‌గా నడిపించిన దర్శకుడు ద్వితీయార్థంలో కాస్త స్లో అయ్యాడు. ఎమోషనల్‌ సీన్స్‌ కాస్త సాగదీసినట్టుగా అనిపించినా.. తరువాత వచ్చే ఎం‍టర్‌టైన్మెంట్‌తో అన్ని కవర్‌ అయిపోతాయి. సినిమాకు మరో మేజర్‌ ప్లస్‌ పాయింట్ గోపిసుందర్‌ సంగీతం. కథలో భాగంగా వచ్చిపోయే పాటలు ఆడియన్‌ను మరింతగా క్యారెక్టర్స్‌తో కనెక్ట్ చేసేస్తాయి. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు ఇలా అన్ని సినిమా స్థాయికి తగ్గట్టుగా సరిగ్గా కుదిరాయి. ఇక న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే.. అర్జున్‌రెడ్డిలో యారగెంట్ పాత్ర‌లో క‌న‌ప‌డ్డ విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ సినిమాలో అందుకు పూర్తి భిన్న‌మైన పాత్ర‌లో క‌న‌ప‌డ్డారు. హీరో, రాహుల్ రామ‌కృష్ణ‌, ఇత‌ర స్నేహితులు మ‌ధ్య వచ్చే సిచ్యువేష‌న‌ల్ కామెడీ ప్రేక్ష‌కుల‌ను న‌వ్విస్తుంది. అలాగే సెకండాఫ్‌లో వెన్నెల‌కిషోర్ కామెడీ మెప్పిస్తుంది. హీరో, హీరోయిన్ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు.. సినిమాటిక్‌గా ఉన్నా.. ఎక్క‌డా బోర్ కొట్టించ‌వు. అలాగే హీరోయిన్ ప్రేమ‌ను గుర్తించిన హీరో.. పెళ్లిని ఆప‌డానికి శ్ర‌మ‌ప‌డ‌టం.. రాహుల్ రామ‌కృష్ణ‌, వెన్నెల‌కిశోర్ మ‌ధ్య కామెడీ ట్రాక్ అన్నీ ప్రేక్ష‌కుల‌కు న‌వ్వు తెప్పిస్తాయి. నిత్యామీన‌న్‌, అనుఇమ్మాన్యుయేల్ అతిథి పాత్ర‌ల్లో మెప్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories