‘గీత గోవిందం’ సినిమాకు భారీ కలెక్షన్లు

‘గీత గోవిందం’ సినిమాకు భారీ కలెక్షన్లు
x
Highlights

విజయ్ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం’ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. రాజమౌళి, చిరంజీవి లాంటి ప్రముఖులు.. సినిమా బాగుందని ప్రశంసలు గుప్పిస్తున్నారు....

విజయ్ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం’ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. రాజమౌళి, చిరంజీవి లాంటి ప్రముఖులు.. సినిమా బాగుందని ప్రశంసలు గుప్పిస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత అందుకు పూర్తి విరుద్ధమైన గెటప్‌లో విజయ్ కనిపించిన ఈ సినిమాకు ప్రశంసలే కాదు కలెక్షన్లు కూడా బాగున్నాయి. ఇక్కడి మార్కెట్లోనే కాదు.. ఓవర్సీస్‌లోనూ గోవిందుడు భారీగా కలెక్షన్లు రాబడుతున్నాడు. సాధారణ అంచనాలతో ఈ నెల 15 విడుదలైన గీత గోవిందం సినిమా భారీ విజయం దిశగా పయనిస్తోంది. విజయ్ దేవరకొండ నటన, రష్మిక అభినయం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చాలా గ్యాప్ తరువాత పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా యూఎస్ లో భారీ కలెక్షన్లు వసూలు చేస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా 731,294 డాలర్లు వసూలు చేసి 1 మిలియన్ మార్కును దాటేందుకు సిద్ధమైంది. నేడు(ఆదివారం) కావడంతో సినిమాకు మాంచి రెస్పాన్స్ వచ్చే అవకాశమున్నట్టు సినీ క్రిటిక్ తరన్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు.గీత గోవిందం సినిమా మూడు రోజుల కలెక్షన్స్ అయన వెల్లడించారు.బుధవారం $ 400,092, గురువారం $ 198,329, శుక్రవారం $ 132,873, మొత్తంగా..731,29 డాలర్లు వసూలు చేసినట్టు అయన తెలిపారు. ఇదిలావుంటే గీత గోవిందం సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ కలెక్షన్స్ రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా గీత గోవిందం కనకవర్షం కురిపిస్తున్నది. గత మూడు రోజుల్లో నైజాంలో 5.01 కోట్ల షేర్ సాధించడం గమనార్హం. ఇక ఆంధ్రా ప్రాంతంలోని వైజాగ్‌లో 1.34 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.01 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 1.09 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ. 97 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.1.04 కోట్లు, గుంటూరులో రూ.1.29 కోట్లు వసూలు చేసింది. నెల్లూరులో రూ. 44 లక్షల కలెక్షన్లను ఈ చిత్రం నమోదు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories