గౌరీ లంకేశ్‌ హత్య కేసులో కీలక పరిణామం

Submitted by arun on Fri, 06/08/2018 - 13:23
 Gauri Lankesh

సంచలనం సృష్టించిన సీనియర్‌ జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెంగుళూరులో గత ఏడాది సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య కేసులో పోలీసులు మొదటిసారి నవీన్ కుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. హిందూ అతివాద గ్రూపునకు చెందిన ఒకరికి తానే బుల్లెట్లు సరఫరా చేశానని నవీన్ పోలీసుల ఎదుట అంగీకరించాడు. ‘ గౌరీ లంకేష్ హిందూ వ్యతిరేకి.. ఆమెకు జీవించే హక్కు లేదు ‘ అని ఆ వ్యక్తి తనతో చెప్పాడన్నారు. అతని పేరు ప్రవీణ్ అని, లోగడ హిందూ జాగృతి సమితి అనే సంస్థ నిర్వహించిన సమావేశంలో అతడు తనకు పరిచయమయ్యాడని నవీన్ చెప్పాడు. అక్రమ ఆయుధ డీలర్ కూడా అయిన నవీన్ చెప్పిన విషయాలు విని ఖాకీలు షాక్ తిన్నారు. 2014 లో హిందూ యువసేనను తానే ఏర్పాటు చేశానని, మైసూరులో కాలేజీ చదువు మధ్యలోనే ఆపేసిన తాను శ్రీరాం సేన వ్యవస్థాపకుడు ప్రమోద్ ముతాలిక్ ను తరచూ కలిసేవాడినని తెలిపాడు. నవీన్ మీద పోలీసులు 12 పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు. తొమ్మిది నెలల క్రితం గౌరీ లంకేష్ తన ఇంటిబయటే దారుణ హత్యకు గురయ్యారు. అంతకుముందు నిందితులు చాలాసార్లు రెక్కీ నిర్వహించారు.

English Title
Gauri Lankesh Anti-Hindu, Had To Be Killed": Arrested Man's Confession

MORE FROM AUTHOR

RELATED ARTICLES