నడిరోడ్డుపై పేలిన సిలిండర్లు

Submitted by arun on Fri, 01/12/2018 - 15:25
oil tanker blast

హైదరాబాద్‌ శివారులోని మేడిపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సిలిండర్ల లోడ్‌తో వెళ్తున్న లారీని ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. సిలిండర్లు అన్ని పేలడంతో పరిసరాల్లో భారీగా పొగ కమ్ముకుంది. సిలిండర్ల లారీతో పాటు... ఆయిల్‌ ట్యాంకర్‌ కూడా పూర్తిగా తగలబడుతోంది. పేలుడుతో మేడిపల్లి పరిసరాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఉపిరాడక జనం అల్లాడుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.
 

English Title
gas cylinders blast

MORE FROM AUTHOR

RELATED ARTICLES