గరుడవేగ హిట్టే కానీ కలెక్షన్సే

Submitted by arun on Fri, 01/05/2018 - 13:33

యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా తనకంటూ ప్రత్యేక బ్రాండ్‌ను ఏర్పరుచుకున్న హీరో డాక్టర్ రాజశేఖర్. ఒకప్పుడు వరుస హిట్లతో దూసుకుపోయిన ఈ హీరో తరవాత విజయానికి దూరమైపోయారు. సొంతంగా సినిమాలు నిర్మించి చేతులు కాల్చుకున్నారు. ఇక రాజశేఖర్ పనైపోయింది అనుకుంటున్న సమయంలో 'పిఎస్‌వి గరుడవేగ' అంటూ మరో ప్రయోగానికి తెరలేపారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన 'పిఎస్‌వి గరుడవేగ 126.18ఎం విడుద‌లై  రాజ‌శేఖ‌ర్  మంచి హిట్ కొట్టాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.  సినిమా మేకింగ్ నుంచి  ప్రమోషన్స్ వ‌ర‌కు భారీ స్థాయిలో నిర్వహించింది. ఇక  సన్నీ లియోన్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా నిలించింది. మ‌రి ఇన్ని చేసిన సినిమా టోటల్ క‌లెక్ష‌న్లను ఎంత రాబ‌ట్టింద‌ని సినీ పండితులు విశ్లేషిస్తే...ప్ర‌మోష‌న్ తో సినిమా వ‌సూళ్లు భారీగా పెరిగాయ‌ని అంచ‌నా వేస్తున్నారు.  రాను రాను సినిమా క‌లెక్ష‌న్లు మోస్తారుగా రావ‌డంతో 32% మాత్ర‌మే రికవరీ చేసింద‌ని అంటున్నారు. సినిమా టోటల్ థ్రియేటికల్ రైట్స్ రూ.11 కోట్లకు అమ్ముడు పోగా..రూ.7.5 కోట్ల తో షేర్ ను రాబ‌ట్టుకుంది. ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు ఏరియాల్లో సినిమా కనీసం 50 లక్షల షేర్స్ ను క‌లెక్ట్ చేయ‌గా కొన్ని వ‌ర్గాల్ని మాత్ర‌మే ఆక‌ట్టుకుంద‌ని టాక్ 

English Title
Garuda Vega’ Full Time Collection Report

MORE FROM AUTHOR

RELATED ARTICLES