టీడీపీకి గంటా గుడ్‌బై ?

x
Highlights

మంత్రి గంటా దారెటు? టీడీపీకి గండి కొట్టి... కొత్త పార్టీకి గంట మోగించేందుకు సిద్ధమవుతున్నారా? సీఎం విశాఖ పర్యటనకు వస్తున్నా... గంటా మాత్రం తన నివాసం...

మంత్రి గంటా దారెటు? టీడీపీకి గండి కొట్టి... కొత్త పార్టీకి గంట మోగించేందుకు సిద్ధమవుతున్నారా? సీఎం విశాఖ పర్యటనకు వస్తున్నా... గంటా మాత్రం తన నివాసం నుంచి బయటకు రావడం లేదు. కేబినెట్‌ భేటీకి కూడా డుమ్మా కొట్టిన గంటా... మౌనానికి కారణమేంటి?

సీఎం చంద్రబాబు విశాఖ టూర్‌‌‌కు దగ్గరుండి ఏర్పాట్లు చూసుకోవాల్సిన మంత్రి గంటా శ్రీనివాస్‌ పట్టీపట్టనట్టుగా ఉంటున్నారు. కేబినెట్‌ భేటీకి కూడా డుమ్మా కొట్టిన గంటా... విశాఖలోని తన నివాసానికే పరిమిత మయ్యారు. అయితే, గంటా మౌనానికి చాలా కారణకాలున్నట్టు తెలుస్తోంది. సీఎం జిల్లా పర్యటనకు వస్తున్నా... మంత్రి గంటా ఇల్లు వదిలి రాకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. టీడీపీకి గంటా గుడ్‌బై చెప్పబోతున్నారన్న వాదన వినిపిస్తోంది.

గత కొంతకాలంగా టీడీపీలో గంటా శ్రీనివాసరావు వ్యవహారం వివాదాస్పదంగా వుంది. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న వాదన గంటా నుండి వినిపిస్తుంది. సొంత పార్టీలో వ్యతిరేక వర్గం గంటాపై బాహాటంగానే విమర్శలు చేస్తోంది. ఈ నేపధ్యం గంటా రాజకీయ ప్రయాణం 2019లో ఎటు వుండబోతుందనే ఆసక్తి నెలకొంది.

పోటీ చేసే ప్రతిసారి తన వ్యూహ, ప్రతివ్యూహాలతో విజయాన్ని సొంతం చేసుకుంటూ వస్తున్న గంటా శ్రీనివాసరావు ఈ సారి కాస్త గడ్డుపరిస్థితిని ఎదుర్కోక తప్పదనిపిస్తోంది. వైసీపీ, జనసేన పార్టీల వైపు గంటా చూస్తున్నారన్న మాట వినిపిస్తోంది. జనసేన కాపు సామాజిక వర్గం కొమ్ముకాసినా అటు వైపు వెళితే పార్టీ ఇంకా నిర్మణ దశలోనే వున్న నేపధ్యంలో భవిష్యత్తుపై భరోసా తక్కువనిపిస్తోంది. మరో వైపు ప్రధాన ప్రతిపక్షం వైసీపీలో గంటాకు వ్యతిరేక వర్గం బలంగా వుంది. దీంతో ఉన్న పార్టీలో ఉండలేక... మరో పార్టీలోకి వెళ్లే దారి లేక గంటా శ్రీనివాస్‌ పరిస్థితి త్రిశంకు స్వర్గంగా మారింది. అధిష్ఠానం ఆదేశాలతో విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు గంటాకు దూరంగా ఉంటున్నారు. ఇకపై గంటాకు ఒంటరి పోరు తప్పదన్న సంకేతాలు ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గంటా పయనం ఎటు అనేది మాత్రం సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories