గంగమ్మను పరిశుద్ధి చేయలేమా? మన వల్ల కాదా?

Submitted by santosh on Fri, 10/12/2018 - 15:24
ganga river

గంగానదిని పరిశుభ్రం చేయాల్సిన బాధ్యత ప్రధానంగా ప్రభుత్వానిదే అయినప్పటికీ, ప్రజలపై కూడా ఆ బాధ్యత ఉంటుంది. నదీపరివాహక ప్రజలు, భక్తులు కూడా ఈ విషయంలో చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో న్యాయస్థానాలు ఎంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ, ఆశించిన ఫలితాలు మాత్రం రావడం లేదు.

గంగానదీ ప్రక్షాళన కోసం ఒకవైపున వందల సంఖ్యలో ‘శుద్ధి’ కేంద్రాలు పనిచేస్తున్నాయి. మరోవైపున వేలాది పరిశ్రమల నుంచి కాలుష్య విషరసాయనాలు గంగలో కలుస్తున్నాయి. మరో రెండువందల ఏళ్ల వరకూ కూడా గంగానది కాలుష్య రహితం కాబోదు..’ అని సర్వోన్నత న్యాయస్థానం 2014లో వ్యాఖ్యానించడానికి ఇదే కారణం. నదుల పరిశుభ్రత, పట్టణీకరణ, పరిశ్రమల విచక్షణారహిత విస్తరణ, పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గో  రక్షణ వంటివి పరస్పరం ముడివడి ఉన్న సమస్యలు.  దేశ జనాభాలో సుమారు 40 శాతం మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా గంగానదిపై ఆధారపడ్డారు. దాన్ని బట్టే ఇది గంగా నది ప్రక్షాళన ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. 

మనుష్యుల మనసు లోని కలుషితాలను గంగానది పరిహరిస్తుందని అంటారు. నేడు మాత్రం మనుషుల చర్యల కారణంగా గంగానది కాలుష్యపూరితం అయిపోయింది. గంగానదీ పరిశుభ్రం చేయాల్సిన బాధ్యత ప్రధానంగా ప్రభుత్వానినే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే సమయంలో పౌర సమాజం కూడా ఈ విషయంలో చొరవ తీసుకోవాలి. మరీ ముఖ్యంగా భక్తులు గంగానదిని కలుషితం చేసే చర్యలను మానుకోవాలి.   ప్రభుత్వం, సమాజం, భక్తులు అంతా కలసి కట్టుగా కృషి చేసిన నాడే గంగానది ప్రక్షాళన సాధ్యపడుతుంది. ఆ నదికి పూర్వ వైభవం వస్తుంది.

English Title
ganga river

MORE FROM AUTHOR

RELATED ARTICLES