గజల్‌ శ్రీనివాస్‌ కస్టడీ పిటిషన్‌ కొట్టేసిన నాంపల్లి కోర్టు

గజల్‌ శ్రీనివాస్‌ కస్టడీ పిటిషన్‌ కొట్టేసిన నాంపల్లి కోర్టు
x
Highlights

గజల్ శ్రీనివాస్‌ కస్టడీ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. వారం రోజులు గజల్ శ్రీనివాస్‌ను కస్టడీ కోరుతూ.. పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ ను...

గజల్ శ్రీనివాస్‌ కస్టడీ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. వారం రోజులు గజల్ శ్రీనివాస్‌ను కస్టడీ కోరుతూ.. పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. గజల్ శ్రీనివాస్ బెయిల్ పిటిషన్‌పై రేపు విచారణ జరగనుంది. వేధింపుల కేసులో దర్యాప్తు పురోగతి కోసం గజల్ శ్రీనివాస్‌ను పోలీసులు 4 రోజుల కస్టడీ కోరారు. పోలీసుల విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. రేడియో జాకీని వేధించిన కేసులో గాయకుడు గజల్ శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. బాధితురాలు ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరిన్ని ఆధారాల సేకరణ నిమిత్తం గజల్ శ్రీనివాస్‌ను పోలీసులు కస్టడీ కోరారు. గజల్ శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ రేపు విచారణు రానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories