జీవితంలో తొలిసారి ఓటేసిన గద్దర్

Submitted by arun on Fri, 12/07/2018 - 13:09
gaddar

ప్రజాయుద్ధ నౌక గద్దర్ తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. సికింద్రాబాద్ పరిధిలోని అల్వాల్ లోని పోలింగ్ బూత్ లో ఆయన ఓటేశారు. తన జీవితంలో తొలిసారి ఓటు వేశారు ప్రజా గాయకుడు గద్దర్. తన సతీమణితో కలిసి ఆల్వాల్‌లోని వెంకటాపురంలో గద్దర్ ఓటు వేశారు. ఓటు వేయడానికి వచ్చిన సమయంలో గద్దర్ చేతిలో అంబేద్కర్ ఫొటో ఉండటం విశేషం. 70 ఏళ్ల గద్దర్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఓటు వేయలేదు. గతంలో భువనగిరిలో బ్యాంక్ ఉద్యోగిగా చేసే సమయంలో మావోయిస్ట్ పార్టీలో చేరిన గద్దర్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తన ఓటు హక్కును ఎప్పుడూ వినియోగించుకోలేదు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో ఆయన ప్రజా కూటమి తరఫున ప్రచారం చేసిన విషయం తెలిసిందే.
 

English Title
gaddar voted for first time in his life

MORE FROM AUTHOR

RELATED ARTICLES