కాంగ్రెస్‌లోకి ప్రజా యుద్ధనౌక ..?

Submitted by arun on Fri, 10/12/2018 - 10:40
gaddar

ప్రజాగాయకుడు గద్దర్ నేడు ఢిల్లీలో రాహుల్ తో భేటీకానున్నారు. గద్దర్ కుటుంబాన్ని మధుయాష్కీ ఢిల్లీకి తీసుకెళ్లారు. గద్దర్ కుమారుడు ఇటీవలే కాంగ్రెస్ లో చేరడంతో ఇప్పుడు గద్దర్ కూడా హస్తం గూటికి చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే, గద్దర్ మాత్రం మద్దతు తెలిపేందుకే రాహుల్ ను కలుస్తున్నానని తెలిపారు. రాహుల్ సమక్షంలో గద్దర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డ గద్దర్ రానున్న ఎన్నికల్లో తాను కూడా పోటీ చేస్తున్నానని చెప్పారు. మహాకూటమి తరుపున తనకు సీటు ఇస్తే గజ్వేల్ నుంచి కేసీఆర్ పై పోటీకి సిద్ధమని చెప్పారు. గజ్వేల్ నుంచే తన ఓటును నమోదు చేసుకున్నారు. 

ప్రజాగాయకుడు గద్దర్ కాంగ్రెస్ లో చేరనున్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ముందస్తు ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందే తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని గద్దర్ ప్రకటించారు. మొదట ఆయన ఇండిపెండెంట్ అభ్యర్ధిగా బరిలోకి దిగుతారని అందరూ భావించారు. అయితే, గద్దర్ కుమారుడు కాంగ్రెస్ పార్టీలో ఉండటంతో పాటు మధుయాష్కీనే దగ్గరుండి ఢిల్లీకి తీసుకెళ్లం లాంటి పరిణామాలతో.. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. 
 

English Title
Gaddar To Meet Rahul Gandhi

MORE FROM AUTHOR

RELATED ARTICLES