రేప్‌ కేసును వెనక్కి తీసుకునేందుకు కోటి రూపాయలు ఇవ్వాలంటూ...

Submitted by arun on Mon, 06/11/2018 - 18:02
Mohit Goel

251 రూపాయలకే సెల్‌ఫోన్‌ ఇస్తానంటూ ప్రచారం చేసుకున్న రింగ్‌ బెల్స్‌ వ్యవస్థాపకులు మోహిత్‌ గోయల్‌‌తో పాటు మరో ఇద్దర్ని ఢిల్లీ నోయిడా పోలీసులు అరెస్టు చేశారు. ఓ బిజినెస్‌మ్యాన్‌ పై నమోదైన రేప్‌ కేసును వెనక్కి తీసుకునేందుకు కోటి రూపాయలు తీసుకున్నారన్న ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేశారు. గ్యాంగ్‌రేప్‌ కేసును వెనక్కి తీసుకునేందుకు డబ్బులివ్వకపోతే...ఇతర కేసుల్లో ఇరికిస్తానంటూ మహిళ రోహిణీ ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్తను బెదిరించింది. భయపడ్డ వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలో రంగంలోకి దిగిన పోలీసులు డబ్బులిస్తామంటూ...రెస్టారెంట్‌కు పిలిపించారు. అక్కడ వ్యాపారి...మహిళకు డబ్బులిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళ‌కు మోహిత్‌ గోయల్‌తో పాటు సోదరుడు వికాస్ మిత్తల్‌ సహకరమందించినట్లు విచారణలో తేలడంతో...వారిని కూడా అరెస్ట్ చేశారు.

Tags
English Title
Freedom 251 Founder Mohit Goel Held for Alleged Extortion

MORE FROM AUTHOR

RELATED ARTICLES