ఇలాంటి సంజయ్.. ఊరికొక్కడైనా ఉండాలి

Submitted by arun on Mon, 03/12/2018 - 12:09
Sanjay

పేరుకు కోటీశ్వరులైనా..  సహాయం చేసే స్తోమత కలిగిన వారైనా… కనీసం రూపాయి కూడా సహాయం చేయడానికి చాలా మంది జంకుతూ ఉంటారు. అలాంటి వారికి.. కనువిప్పు కలిగేలా చేస్తున్నారు.. బోరబండకు చెందిన సంజయ్. ఆయన.. ఓ ఆటో డ్రైవర్. మహా అయితే.. రోజంతా కష్టపడితే.. రోజుకు వెయ్యి రూపాయలు కూడా వెనకేసుకోవడం కష్టం. అయినా.. తనలోని మానవత్వాన్ని చాటుకుంటూ.. అవసరం ఉన్నవారికి తనవంతుగా సహాయపడుతున్నారు.

2010 నవంబర్ లో నిండు గర్భిణి అయిన తన భార్యకు నొప్పులు రావడంతో.. హాస్పిటల్ తీసుకెళ్లేందుకు సంజయ్ చాలా కష్టపడ్డారు. ఎలాగోలా.. రిక్షాలో తీసుకెళ్లి చికిత్స చేయించారు. కాపాడుకున్నారు. అప్పటి నుంచే.. ఇలా గర్భవతులుగా ఉన్నవారికి ఇబ్బంది రాకుండా ఏదైనా తన వంతు సహాయం చేయాలని అనుకున్నారు. సమయానికి అలాంటివారికి హాస్పిటల్ కు వెళ్లే అవకాశం లేకపోతే ఎలా అని ఆలోచించారు.

మూడేళ్లు కష్టపడి.. ఓ ఆటో కొనేశారు. 2013 డిసెంబర్ నుంచి కార్యాచరణ మొదలు పెట్టారు. గర్భిణులు.. వృద్ధులు మాత్రమే కాదు.. వికలాంగులనూ క్షేమంగా హాస్పిటల్ కు చేర్చుతున్నారు. ఏ మాత్రం డబ్బులు తీసుకోకుండా స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు. ఇప్పటివరకూ.. ఇలా 260 మందిని క్షేమంగా గమ్యాలకు చేర్చారట. అందుకే.. ఇలాంటి సంజయ్.. కనీసం ఊరికి ఒక్కరైనా ఉంటే.. దేశానికి ఎంతో మేలు జరగడం ఖాయం. ఏమంటారు!!

English Title
free auto service pregnents and elders

MORE FROM AUTHOR

RELATED ARTICLES