వ్యభిచార ముఠాలపై పోలీసుల ఉక్కుపాదం

వ్యభిచార ముఠాలపై పోలీసుల ఉక్కుపాదం
x
Highlights

యాదగిరిగుట్టలో బయటపడ్డ వ్యభిచార ముఠాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. చిన్నారులు త్వరగా మెచ్యూర్ అయ్యేందుకు ఇంజెక్షన్లు ఇచ్చిన ఆరీఎంపీ డాక్టర్లలో...

యాదగిరిగుట్టలో బయటపడ్డ వ్యభిచార ముఠాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. చిన్నారులు త్వరగా మెచ్యూర్ అయ్యేందుకు ఇంజెక్షన్లు ఇచ్చిన ఆరీఎంపీ డాక్టర్లలో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి చిన్నారులను తరలించి బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్న ముఠా సభ్యులను ఒక్కొక్కరిని అరెస్టు చేసి అక్రమార్కులను కటకటాల వెనక్కు నెడుతున్నారు.

యాదగిరిగుట్టను కేంద్రంగా కొనసాగుతున్న వ్యబిచార ముఠా గుట్టు రట్టు చేశారు. యాదగిరిగుట్టలోని గణేష్ నగర్, బీసీ కాలనీల్లో రాచకొండ పోలీసులు సోదాలు నిర్వహించారు. వ్యభిచార ముఠాలో చిక్కుకున్న వారికి విముక్తి కల్గించారు. ఎవరితో సంబంధం లేని బాలికలను గుర్తించారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించడంతో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.

ఊహతెలియని వయసులోనే బాలికలను ఇక్కడికి తీసుకువచ్చి కాస్త వయసొచ్చాక వ్యభిచార రొంపిలోకి లాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. బాలికలు త్వరగా మెచ్యూర్ అయ్యేందుకు ప్రత్యేకమైన ఇంజక్షన్లు ఇస్తున్నట్లు నిర్దారించుకొని దాడులు చేశారు. ఓ వ్యభిచార గృహం నిర్వాహకులు ఇచ్చిన సమాచారంతో పట్టణంలోని ఓ నర్సింగ్ హోం నడుపుతున్న ఆర్ఎంపీ డాక్టర్ ను అరెస్ట్ చేశారు. ఆసుపత్రి నుంచి 43 ఆక్సిటోన్ ఇంజక్షన్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

వ్యబిచార ముఠా చేతిలో చిక్కి శారీరకంగానూ మానసికంగాను దోపిడీకి గురవుతున్న బాలికలను పోలీసులు రక్షించారు. 11 మంది నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పీడీయాక్టు నమోదు చేశారు. వ్యబిచారం నిర్వహిస్తున్న ఇళ్లను సీజ్ చేశారు. మరికొందరు తమ ఇళ్లకు తాళాలు వేసి పరారైనట్టు పోలీసులు గుర్తించారు. ప్రభుత్వం తమకు ఏదైనా ఆధారం చూపించినట్లయితే తమ జీవితాలు మార్చుకుంటామంటున్నారు నిందితులు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా యదేచ్చగా వ్యభిచార కార్యకలాపాలు కొనసాగటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ముఠాల వెనుక ఎవరున్నారో బయటకు బయట పెట్టాలని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories