మాజీ ఐఏఎస్ అపరాజిత బీజేపీలో చేరిక

Submitted by chandram on Tue, 11/27/2018 - 13:04
sarangi

మాజీ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఎఎస్) అధికారి అపరాజిత సారంగి మంగళవారం భారతీయ జనతా పార్టీ (బీజేపి) లో చేరారు. బీజేపీ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా నివాసంలో సారంగి బీజేపీ తీర్ధంపుచ్చుకున్నారు. పార్టీకండువా కప్పి ఆనందంగా సారంగిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బిజెపి ఒడిషా చీఫ్ బసంత్ పాండా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.1994-బ్యాచ్ ఐఏఎస్ అధికారి రేపు ఒరిస్సాకి తిరిగి రావాల్సి ఉంది. బిజెపి నాయకులు రాష్ట్ర శాఖను స్వాగతించారు. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కింద మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజిఎన్ఆర్ఇజిఎ) జాయింట్ సెక్రటరీగా పనిచేసిన సారంగి ఈ ఏడాది ఆగస్టులో ఆమె పదవీకాలం పూర్తి చేశారు. ఈ నెల 16న స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేయగా, దాన్ని వెంటనే కేంద్రం ఆమోదించింది. 

English Title
Former IAS officer Aparajita Sarangi joins BJP

MORE FROM AUTHOR

RELATED ARTICLES