ఏపీలో ఆపరేషన్ ఘర్ వాపసీ సక్సెస్...త్వరలోనే మరో 40 మంది...

ఏపీలో ఆపరేషన్ ఘర్ వాపసీ సక్సెస్...త్వరలోనే మరో 40 మంది...
x
Highlights

పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని కాంగ్రెస్ ఆశపడుతోంది. విభజన దెబ్బతో కకావికలమై పోయిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు సమీపిస్తుం డటంతో మళ్లీ తమ నాయకులందరినీ...

పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని కాంగ్రెస్ ఆశపడుతోంది. విభజన దెబ్బతో కకావికలమై పోయిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు సమీపిస్తుం డటంతో మళ్లీ తమ నాయకులందరినీ వెనక్కు పిలుస్తోంది. ఆపరేషన ఘర్ వాపసీ పేరిట వారిని చేరదీసి ఎన్నికలకు సమాయత్తమవుతోంది.

ఉమ్మడి రాష్ట్ర ఆఖరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎట్టకేలకు మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. విభజన వద్దని సమైక్యమే ముద్దని కడదాకా నమ్మిన కిరణ్ కుమార్ రెడ్డి విభజన తర్వాత దాదాపు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ ఎన్నికల సమయంలో యాక్టివ్ అయ్యారు కాంగ్రెస్ లో ఉన్న అతికొద్ది మంది సమర్ధవంతమైన నేతల్లో కిరణ్ ఒకరు తండ్రి అమరనాథ్ రెడ్డి పరపతితో కాంగ్రెస్ రాజకీయాల్లో చాలా సులభంగానే కిరణ్ పదవులు పొందారు. ముక్కు సూటితనం చురుకుతనం, తెలివి తేటలతో వైఎస్ కు అనుంగు శిష్యుడు, ఇష్టుడు గా మారిన కిరణ్ వైఎస్ హయాంలోనే చీఫ్ విప్ స్థాయి నుంచి, స్పీకర్ స్థాయికి ఎదిగారు. వైఎస్ మరణం తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ సంక్షోభంలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు.

రాష్ట్రం కలసి ఉండాలని కడ దాకా కోరుకున్నారు తాను నమ్మిన సిద్ధాంతంకోసం రాజీలేని పోరాటం చేసే తత్వం కిరణ్ ది. అందుకే విభజనను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు ఏపీ కాంగ్రెస్ చరిత్రలోనే ఇలాంటి తిరుగుబాటు లేదు విభజనానంతరం సమైక్యాంధ్ర పార్టీ పెట్టినా ఎన్నికల్లో గెలవకపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సార్వత్రిక ఎన్నికలు వస్తున్న తరుణంలో కాంగ్రెస్ ఆపరేషన్ ఘర్ వాపసీ కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. కిరణ్ ను తిరిగి పార్టీలోకి తీసుకుని సేవలు వాడుకోవాలని నిర్ణయించింది. కేంద్రమాజీ మంత్రులు పళ్లంరాజు, శీలం తదితరులతో మాట్లాడించి కిరణ్ ను ఒప్పించింది. కొన్నాళ్ల క్రితం ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమైన కిరణ్ పార్టీలోకి తిరిగి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. నిన్న రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుని మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు.

కిరణ్ కుమార్ రెడ్డికి ఏపి కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పదవినిచ్చే అవకాశముంది. త్వరలోనే మరో 40 మంది తిరిగి కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. కిరణ్ రాకతో కాంగ్రెస్ మళ్లీ కళకళలాడుతుందా? తన తండ్రి అమరనాథ్ రెడ్డి వర్ధంతి రోజునే కిరణ్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరగా టీడీపీలో ఉన్న ఆయన సోదరుడు కిషోర్ ఇవాల్టి నుంచే నియోజక వర్గంలో హడావుడి పెంచారు. అనుచరులతో సమావేశమై అభివృద్ధి పనుల వేగం పెంచారు అన్నా దమ్ములిద్దరూ చెరో పార్టీలో చేరడంతో చిత్తూరు రాజకీయాలు ఒక్కసారిగా వేగం పుంజుకున్నాయి. పీలేరులో ఇక అన్నదమ్ముల పోటా పోటీ ప్రచారం చూడాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories