లైవ్‌లో రిపోర్టర్‌కు ముద్దిచ్చాడు..

Submitted by arun on Wed, 06/20/2018 - 14:10
kiss

ప్రస్తుతం వరల్డ్ కప్ సాకర్ పోటీలు జరుగుతున్న రష్యాకు వెళ్లిన కొలంబియా మహిళా జర్నలిస్టుకు వింతైన అనుభవం ఎదురైంది. ఓ జర్మన్ న్యూస్ చానల్ లో పనిచేస్తున్న జూలియట్ గోంజాలెజ్ థెరాన్ అనే యువతి, సరన్స్ ప్రాంతంలో నిలబడి లైవ్ రిపోర్టు ఇస్తుండగా, గుర్తు తెలియని ఓ యువకుడు వచ్చి, ఆమె బుగ్గపై ముద్దు పెట్టి వెళ్లాడు. ఈ వీడియోను జూలియట్ ట్విటర్‌లో షేర్ చేసుకుంది. తాను ఆ స్పాట్‌లో రెండు గంటలుగా ఉన్నానని, అయితే లైవ్ రిపోర్టింగ్ మొదలు పెట్టే వరకు ఆ వ్యక్తి వేచి చూశాడని ఆమె చెప్పింది. లైవ్‌లో ఇలా చేస్తే తాను వెంటనే రియాక్టయ్యే అవకాశం ఉండదని భావించి అతనిలా చేసినట్లు జూలియట్ తెలిపింది. అతను ముద్దు పెట్టి వెళ్లినా ఆమె మాత్రం అలాగే లైవ్ కొనసాగించింది. ఆ తర్వాత అతని కోసం వెతికినా కనిపించలేదని జూలియట్ చెప్పింది. ఆమెకు ముద్దు పెట్టిన వ్యక్తి స్థానికుడా లేక వరల్డ్‌కప్ చూడటానికి వచ్చిన వ్యక్తా అన్నది స్పష్టంగా తెలియలేదు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

English Title
a football fan in russia kissed a lady reporter

MORE FROM AUTHOR

RELATED ARTICLES