శృంగార సామ‌ర్ధ్యం త‌గ్గిపోవ‌డానికి కార‌ణం

Submitted by lakshman on Wed, 04/11/2018 - 06:08
Foods That Increase Sexual Stamina

మన ఆహారపు అలవాట్లపై ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వులు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్లు శరీర పోషణకు, రక్షణకు ఉపయోగపడతాయి. ఇవి పండ్లు, కూరగాయలు, త్రుణధాన్యాల్లో విరివిగా లభిస్తాయి. అలాగే లైంగిక సామర్థ్యం, ఆసక్తి తగ్గడానికి మానసిక, శారీరక, ఆరోగ్య సమస్యలు కూడా కారణం కావచ్చు. చాలామందిలో ఎలాంటి సమస్య లేకపోయినా ఆసక్తి సన్నగిల్లుతుంది. దీని నుంచి బయటపడాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం, ఒత్తిడికి దూరంగా ఉండాలి. దీంతో పాటు ఆహారం విషయంలో శ్రద్ధ అవసరం.

బాదం, జీడిపప్పు, అక్రోట్స్ లాంటి నట్స్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. వీటిలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచే సెలీనియం, జింక్‌తో పాటు ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి మెదడులో డొపమైన్ స్థాయిలను పెంచడానికి దోహదం చేస్తాయి. డొపమైన్ వల్ల సెక్స్ కోరికలు పెరుగుతాయి.

తీరకలేని పనివల్ల అలసిపోవడం కూడా శృంగారంపై ఆసక్తి తగ్గడానికి మరో కారణం. ప్రొటీన్లు పుష్కలంగా లభించే గుడ్లును రోజూ తీసుకుంటే అలసట దూరమవుతుంది. కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి తోడ్పడతాయి. అంగ స్తంభనలోపం బారిన పడుకుండా కాపాడే ఆమైన్ ఆమ్లాలు గుడ్లు ద్వారా లభిస్తాయి.

స్ట్రాబెర్రీ గింజల్లో జింక్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. వీర్యం ఉత్పత్తికి అవసరమైన పురుష హార్మోన్ టెస్టోస్టీరాన్‌ను జింక్ నియంత్రిస్తుంది. సెక్స్ కోరికల ఉద్దీపన కలుగజేస్తుంది. మిగతా పండ్ల మాదిరిగా కాకుండా బెర్రీలను గింజలతో పాటు తింటారు కాబట్టి జింక్ దండిగా లభిస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు లైంగిక అవయవాలకు రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చూస్తాయి. దీంతో స్తంభన సమస్యలు తలెత్తవు.
కాఫీలోని కెఫైన్‌ మెటబాలిజాన్ని మెరుగు పరుస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరిచి ఫ్యాట్ స్టోర్స్‌ను విడుదల చేసి, రాత్రికి సరిపడా శక్తిని ఇస్తుంది.
సెక్స్ రెప్యుటేషన్‌‌లో ఆస్టర్లు చాలా ప్రభావం చూపుతాయి. జింక్ , విటమిన్‌ బి 6 దీనిలో పుష్కలంగా లభిస్తాయి. టెస్టోస్టిరాన్‌‌కు ఈ రెండూ చాలా కీలకం.
మిరప తినగానే ముఖం ఉబ్బుతుంది. అంటే రక్తనాళాలు విస్తరిస్తాయి. ముఖంలోని రక్తనాళాలే కాకుండా పురుషాంగానికి రక్తం సరఫరా మెరుగవుతుంది.
ఉల్లి, వెల్లుల్లిలోని ఫిటోకెమికల్ ఎల్లిసిన్‌ రక్తాన్ని గడ్డకట్టుకుండా చేసి, ప్రసరణను పెంచుతుంది. వీటి వల్ల క్లాట్, క్లాగ్‌లు తగ్గిపోతాయి.
 

English Title
Foods That Increase Sexual Stamina

MORE FROM AUTHOR

RELATED ARTICLES