వార్నింగ్‌..తాగుబోతు డ్రైవర్ల పని పట్టడానికి 220 టీములు

వార్నింగ్‌..తాగుబోతు డ్రైవర్ల పని పట్టడానికి 220 టీములు
x
Highlights

న్యూఇయర్‌ వేడుకలపై హైదరాబాద్‌ పోలీసులు ఆంక్షలు విధించారు. గైడ్‌లైన్స్‌ ఫాలో కాకపోతే సీరియస్‌ యాక్షన్‌ ఉంటుందని వార్నింగ్‌ ఇచ్చారు. హోటళ్లు,...

న్యూఇయర్‌ వేడుకలపై హైదరాబాద్‌ పోలీసులు ఆంక్షలు విధించారు. గైడ్‌లైన్స్‌ ఫాలో కాకపోతే సీరియస్‌ యాక్షన్‌ ఉంటుందని వార్నింగ్‌ ఇచ్చారు. హోటళ్లు, రిసార్ట్‌లు ఎవరైనా ఎక్స్‌ట్రాలు చేస్తే తాట తీస్తామన్నారు. ఒంటి గంట కొట్టగానే అన్ని మూసేయాలని ఆర్డరేశారు.

2018 న్యూ ఇయర్ వేడుకలపై కొరడా ఝుళిపించారు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు. ఇటీవల కాలంలో నగర శివారులోని కొన్ని స్టార్ హోటల్స్, రిసార్ట్స్ లు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నాయని పోలీసులకు ఫిర్యాదులు అందటంతో మూడు కమీషనరేట్ల పోలీసులు అలర్ట్ అయ్యాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని స్టార్ హోటల్స్, పబ్స్, రిసార్ట్స్, ఫామ్ హౌస్‌లపై అంక్షలు విధించారు. హోటల్స్, పబ్‌లు, రిసార్ట్స్, ఫామ్ హౌస్‌లు 31 న రాత్రి 8 గంటల నుంచి అర్ధారత్రి ఒంటి గంట వరకే పార్టీలు నిర్వహించుకోవాలని ఆదేశించారు.

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా నిర్వాహకులకు పలు గైడ్ లైన్స్ విడుదల చేసిన పోలీసులు వాటిని పాటించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీరియస్‌గా వార్నింగ్‌ ఇచ్చారు. వేడుకల నిర్వహణ కోసం 15 రోజుల క్రితమే అనుమతి ఇచ్చామని, అయితే అనుమతి లేకుండా వేడుకలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. డిజే సౌండ్, హుక్కా, డ్రగ్స్, రేవ్ పార్టీలకు నో పర్మిషన్‌ అని తేల్చి చెప్పారు. సౌండ్ 45 డెసిబుల్స్ కు మించకుండా ఉండాలని నిర్దేశించారు. న్యూఇయర్‌ సెలబ్రేషన్‌కి సంబంధించి పోస్టర్స్, హోర్డింగ్స్ పబ్లిక్ ప్లేసుల్లో నిషేధించారు.

న్యూఇయర్‌ పార్టీ నిర్వాహకులు ఆయుధాలతో వచ్చే వారిని అనుమతించరాదని, పరిమితికి మించి ఎంట్రీలు ఇవ్వరాదన్నారు పోలీసు. కొత్త ఏడాది వేడుకలు జరిగే చోట సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరని ఆదేశాలు జారీచేశారు. నిర్వాహకులు ఎవరికి వారు ప్రైవేట్ సెక్యూర్టీని ఏర్పాటు చేసుకోవాలని, పార్కింగ్ ఏర్పాట్లు సక్రమంగా చేయాలని పోలీసులు ఆదేశించారు. 31వ తేదీ రాత్రి 8 గంటలకు సెలబ్రేషన్స్‌‌ మొదలు పెట్టి ఎట్టిపరిస్థితుల్లో 1 గంటవరకు పూర్తి చేయాలని పోలీసులు స్పష్టం చేశారు. అలాగే పార్టీలలో క్రాకర్స్ లను పూర్తిగా నిషేధించారు పోలీసులు. 31 న రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఔటర్ రింగ్ రోడ్డును, సిటీలోని ప్లై ఓవర్లను క్లోజ్ చేస్తున్నట్లు సైబరాబాద్ కమీషనర్ సందీప్ శాండిల్యా తెలిపారు.

న్యూ ఇయర్ వేడుకలపై సిటీ ట్రాఫిక్ పోలీసులు పోకస్ పెట్టారు. నూతన సంవత్సర వేడుకల్లో అపశ్రుతులు జరగకుండా సైబరాబాద్ పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా డిసెంబర్ 31 రాత్రి జరిగే వేడుకల్లో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని డ్రంక్ అండ్ డ్రైవ్‌ తో కళ్లెం వేసేందుకు హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మొత్తం 100 ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 ఉదయం 5 గంటల వరకు వివిధ ప్రాంతాలలో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహించనున్నారు. పరిమితికి మించి మద్యం తాగి వాహనాలు నడిపితే సీజ్ చేయటమే కాకుండా మందు మోతాదును బట్టి శిక్షలుంటాయని పోలీసులు చెప్తున్నారు. సైబరాబాద్ పరిధిలో 120 టీమ్స్, హైదరాబాద్ పరిధిలో 100 టీమ్స్ డ్రంకెన్ డ్రైవ్ కోసం పని చేయనున్నాయి. ఇక ఓవర్‌ స్పీడ్‌‌పై కూడా సిటీ పోలీస్‌ నజర్‌ పెట్టనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories