శిరిడీ సాయి భక్తులకు షాకిచ్చిన ఆలయ ట్రస్ట్

శిరిడీ సాయి భక్తులకు షాకిచ్చిన ఆలయ ట్రస్ట్
x
Highlights

శిరిడీ సాయి భక్తులకు ఆలయ ట్రస్ట్ షాకిచ్చింది. శతాబ్ధానికిపైగా చరిత్ర ఉన్న సంప్రదాయానికి స్వస్తి పలికింది. బాబా ఆలయంలో పూల వాడకంపై నిషేధం విధించింది....

శిరిడీ సాయి భక్తులకు ఆలయ ట్రస్ట్ షాకిచ్చింది. శతాబ్ధానికిపైగా చరిత్ర ఉన్న సంప్రదాయానికి స్వస్తి పలికింది. బాబా ఆలయంలో పూల వాడకంపై నిషేధం విధించింది. భక్తులెవరూ పూలు తీసుకురావద్దని ఆదేశాలు జారీచేసింది.
ఆలయం వెలుపల పూల వ్యాపారులతో భక్తులు ఇబ్బందులు పడుతున్నందువల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. పూల మాలలు, పూలు కొనాలని భక్తులను వ్యాపారులు వేధింపులకు గురిచేస్తున్నారని, కొనేవరకు వెంటపడుతున్నారని చెప్పారు. ముఖ్యంగా.. స్కూలుకు వెళ్లాల్సిన చిన్న పిల్లలు.. ఈ వ్యాపారంలో కీలకమవుతున్నట్లు గుర్తించామని.. తాజా నిర్ణయంతో దానిని అరికట్టవచ్చని చెబుతున్నారు.
అయితే... తాజా నిర్ణయంపై భక్తులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా వస్తున్న సంప్రదాయానికి స్వస్తి పలకడం సరికాదంటున్నారు. ఇది.. భక్తుల మనోభావాలతో ఆడుకోవడమేనని విమర్శిస్తున్నారు. అటు... పూల అమ్మకమే జీవనోపాధిగా మార్చుకున్నచిరు వ్యాపారులు, పూల పంటలు సాగుచేస్తున్న రైతులు సైతం ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఉన్నపళంగా తమ ఉపాధిని దెబ్బతీస్తే బతికేదెలా అని ప్రశ్నిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories