ఆన్ లైన్ మార్కెటింగ్ లో మరో సంచలనం!

Submitted by arun on Mon, 03/05/2018 - 15:06
flipkart

ఆన్ లైన్ లో ఏవైనా వస్తువులు కొనాలనుకుంటున్నారా? మీ చేతిలో, బ్యాంక్ ఖాతాలో డబ్బులు లేవా? అయినా పర్లేదు అప్పిస్తామంటోంది ఫ్లిప్ కార్ట్. పే లేటర్ పేరుతో కొత్తగా ప్రారంభించిన సర్వీస్ తో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. క్రెడిట్ కార్డు రూపంలో అరువు పెట్టే అలవాటు ఎప్పుడో మొదలయింది. కానీ దేశంలో ఒక శాతం ప్రజలు మాత్రమే క్రెడిట్ కార్డ్ వినియోగిస్తున్నారు. అందుకే వస్తువులను అరువు ఇచ్చేందుకు ఫ్లిప్ కార్ట్ ముందుకు వచ్చింది. అత్యవసర సమయాల్లో మనకు దగ్గరున్న దుకాణాల్లో అరువు పెట్టడం సహజం. ఇదే ట్రెండ్ ను ఇప్పుడు ప్రముఖ ఇ-కామర్స్ కంపెనీ ఫ్లిప్ కార్ట్ ఫాలో అవుతోంది. 

పే లేటర్ పేరుతో ఫ్లిప్ కార్ట్ ప్రారంభించిన సర్వీసులో వినియోగదారుల ఫ్లిప్ కార్ట్ ఎకౌంట్ హిస్టరీని బట్టి వారికి ప్రారంభంలో 5 వేల రూపాయల నుండి పది వేల వరకు క్రెడిట్ లిమిట్ లభిస్తుంది. దీని సాయంతో నెల రోజుల పాటు ఏదైనా కొనుగోలు చేయవచ్చు. అపై ప్రతీ నెల మొదటి తారీఖు రోజుల్లో బిల్ జనరేట్ అవుతుంది. దీనిని పదో తేదీ లోపు చెల్లిస్తే సరిపోతుంది. అంటే దాదాపు నలబై రోజుల పాటు వడ్డీ లేని కాలపరిమితికి వస్తు రుణ సదుపాయం లభిస్తుందన్న మాట.

అప్పు ఇచ్చినవాళ్లు వడ్డీ కూడా తీసుకుంటారు కదా. అలాగే నలభై రోజుల్లో చెల్లిస్తే ఎలాంటి వడ్డీ వేయని ఫ్లిప్ కార్ట్.. ఆ తర్వాత కూడా బిల్ చెల్లించకపోతే 2 వేల రూపాయలకు 2 వందల రూపాయలు, 4 వేలు ఆపై అయితే నాలుగు వందల రూపాయల వరకు అపరాధ రుసుము వేస్తుంది. దీని కోసం వినియోగదారుని పాన్ కార్డ్ తదితర వివరాలను ఫ్లిప్ కార్ట్ తీసుకుంటుంది. పే లాటర్ సర్వీస్ ను అవసరానికి ఉపయోగించుకోవడం మంచిదే కావొచ్చు. అయితే అరువుగా ఇస్తున్నారని అవసరం లేని వస్తువులను కొనుగోళు చేస్తే చివరికి బిల్ కట్టలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. 

English Title
Flipkart launches ‘buy now, pay later’ feature

MORE FROM AUTHOR

RELATED ARTICLES