రేపటినుంచే 'బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్'.. 70శాతం తగ్గింపు ధరల్లో ఫోన్లు..

Submitted by nanireddy on Tue, 12/04/2018 - 18:15
flipkart-back-another-shopping-sale-big-shopping-days-kicks-december-6th

మొన్న పండగ సందర్బంగా బిగ్ దివాలి సేల్ తో అదరగొట్టిన ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ మళ్లీ భారీ ఆఫర్లతో ముందుకు రాబోతుంది. ఈసారి కేవలం రెండు రోజులపాటు 'బిగ్ షాపింగ్ డేస్ సేల్' అందుబాటులో ఉంటుంది. డిసెంబర్ 6నుంచి 8 వరకు.. ప్రతీ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఈ సేల్ ఉంటుంది.  ఈ ఆఫర్లో భాగంగా వివిధ కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్లపై అక్షర్షణీయమైన ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్‌  ప్రకటించింది. అలాగే టీవీలు, ల్యాప్‌టాప్స్, ఇతర గ్యాడ్జెట్స్‌లపై 70శాతం దాకా డిస్కౌంట్ అందిస్తోంది. వీటిని హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్, డెబిట్ కార్డులపై కొనుగోలు చేస్తే అదనంగా 10శాతం డిస్కౌంట్‌,ఇంకా నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉందని ఫ్లిప్‌కార్ట్‌ వెల్లడించింది. షావోమి, నోకియా, హానర్‌  తదితర ఫోన్లపై భారీ తగ్గింపును అందిస్తోంది. రియల్‌మీ సీ 1, రెడ్‌మినోట్‌ 6 ప్రో, పోకో ఎఫ్1 స్మార్ట్‌ఫోన్లు తగ్గింపు ధరల్లో ఉన్నాయి. కాగా 2018 కి గాను అత్యల్ప ధరలు ఇవే అని ఫ్లిప్‌కార్ట్‌ చెబుతోంది. 


‘బిగ్ షాపింగ్ డేస్ సేల్’ లో వివిధ కంపీనీల స్మార్ట్ ఫోన్ ధరలు ఇలా ఉన్నాయి.

*నోకియా 6.1 ప్లస్: ఆఫర్ ధర రూ.14,999 అసలు ధర రూ.15,999
*పిక్సెల్ 2ఎక్స్ఎల్: ఆఫర్ ధర రూ.39,999, అసలు ధర రూ.45,499.
*షావోమీ రెడ్‌మీ నోట్ 6 ప్రో: ప్రారంభ ధర రూ.13,999.
*8జీబీ+256జీబీ : ఆఫర్‌ ధర రూ.25,999 కాగా అసలు ధర రూ.29,999
*6జీబీ+128జీబీ అసలు ధర రూ.23,999 కాగా ఆఫర్‌ ధర రూ.21,999
*ఆసుస్ జెన్‌ఫోన్ లైట్ ఎల్1: రూ.2000 డిస్కౌంట్‌తో రూ.4,999 ధరకే లభ్యం.
*హానర్‌ 10 : 24,999 ధరకు లభిస్తుంది.
*ఇన్ఫినిక్స్ నోట్ 5: అసలు ధర రూ.9,999. ఆఫర్‌లో రూ.7,999 ధరకే లభిస్తుంది.
*రెడ్‌మీ నోట్ 5 ప్రో: అసలు ధర రూ.13,999. ఆఫర్‌ ధర రూ.12,999.
 

English Title
flipkart-back-another-shopping-sale-big-shopping-days-kicks-december-6th

MORE FROM AUTHOR

RELATED ARTICLES