టీడీపీ-బీజేపీ పొత్తుపై గుంటూరులో ఫ్లెక్సీ కలకలం

Submitted by arun on Sat, 02/03/2018 - 12:08
flexi

ఇప్పటికే ఏపీలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ్. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి ఎలాంటి సహకారం లేదని టీడీపీ నేతలు అంటుంటే, తప్పంతా టీడీపీదే అని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా, కేంద్ర బడ్జెట్ లో ఏపీకి మొండిచేయి చూపించడంతో, టీడీపీ నేతల్లో ఆగ్రహం మరింత ఎక్కువైంది. బీజేపీతో తెగతెంపులు చేసుకుందామంటూ పార్టీ సమన్వయ కమిటీ మీటింగ్ లో ఏకంగా చంద్రబాబుకే టీడీపీ నేతలు సూచించారు. గుంటూరు జిల్లాలోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చర్చనీయాంశమైంది. బీజేపీతో టీడీపీ పొత్తు..ఇంటికి రాదు విత్తు ..మన గింజలు కూడా మనకు దక్కవు అన్న నినాదంతో రాసిన ఫ్లెక్సీని పెట్టారు. టీడీపీ అభిమానుల పేరుతో వెలసిన ఫ్లెక్సీని గుంటూరు వాసులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

English Title
flexi in Guntur

MORE FROM AUTHOR

RELATED ARTICLES