షాకింగ్... ఒకే ఇంట్లో ఐదు మృతదేహాలు..

Submitted by arun on Tue, 08/21/2018 - 11:33
up

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ ఇంట్లో అయిదుగురు అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. భార్యాభర్తలు, ముగ్గురు కూతుళ్ల మృతదేహాలను.. తాళం వేసిన ఇంటి నుంచి పోలీసులు రికవర్ చేశారు. అలహాబాద్‌లోని దమన్‌గంజ్‌లో ఈ ఘటన జరిగింది.  దుమన్ జంగ్ ప్రాంతంలో ఉన్న ఓ ఇంటిలో మనోజ్ కుష్వాహా(35) తన భార్య, ముగ్గురు కుమార్తెలతో ఉంటున్నాడు. కుటుంబ సభ్యులు కనిపించకపోవడంతో ఇంటి పక్కన వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లేసరికి ఇంటికి తాళం వేసి ఉంది.

తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లిన పోలీసులకు మనోజ్ సీలింగ్‌కు ఉరివేసుకుని కనిపించాడు. మనోజ్ భార్య మృత దేహం ఫ్రిజ్‌లో కనిపించింది. ఇద్దరు కుమార్తెల మృతదేహాలు అల్మారాలోని ఓ సూట్‌కేసులో కనిపించగా.. మరో కుమార్తె మృతదేహం పక్క రూమ్ లో కనిపించింది. ఈ దృశ్యాలు చూసి పోలీసులతో పాటు చుట్టుపక్కల వారంతా తీవ్ర విస్మయానికి గురయ్యారు. 'ఇంటి యజమానే భార్య, కుమార్తెలను చంపి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసు అధికారి నితిన్ తివారి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఇంటికి తాళం వేసి ఉండటంతో పలు అనుమానాలకు దారితీస్తోంది. 

English Title
five family members found dead

MORE FROM AUTHOR

RELATED ARTICLES