త్రివిక్ర‌మ్‌కిదే మొద‌టిసారి

Submitted by nanireddy on Fri, 09/15/2017 - 17:25

దర్శ‌కుడిగా త్రివిక్ర‌మ్ వ‌య‌సు 8 సినిమాలు. ఆయ‌న తెర‌కెక్కించిన చిత్రాల్లో సింహ‌భాగం విజ‌యాలే ఉన్నాయి. ప్ర‌స్తుతం త‌న తొమ్మిదో చిత్రాన్ని ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా రూపొందిస్తున్నాడీ మాట‌ల మాంత్రికుడు. 'జ‌ల్సా', 'అత్తారింటికి దారేది' చిత్రాల త‌రువాత ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మూడో చిత్రమిది. ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ చిత్రానికి విడుద‌ల తేదిని మాత్రం జ‌న‌వ‌రి 10గా ఖాయం చేశారు. విశేష‌మేమిటంటే.. త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన ఏ చిత్రం కూడా సంక్రాంతి సీజ‌న్‌లో విడుద‌ల కాలేదు. ప‌వ‌న్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రంతోనే మొద‌టిసారిగా సంక్రాంతి బ‌రిలోకి దిగుతున్నాడు త్రివిక్ర‌మ్‌.   సంక్రాంతిని టార్గెట్ చేసుకుని వ‌స్తున్న‌ త్రివిక్ర‌మ్ మొద‌టి ప్ర‌య‌త్నం బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి ఫ‌లితం అందుకుంటుందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. 

English Title
this is the first time for trivikram

MORE FROM AUTHOR

RELATED ARTICLES