అరుదైన శ్వేతనాగు ఇంట్లో ప్రత్యక్షం..

Submitted by nanireddy on Tue, 07/10/2018 - 12:41
first-rare-albino-cobra-rescued-in-bengaluru

 బెంగుళూరులో ఓ అరుదైన శ్వేతనాగు జనాల కంట పడింది. దీంతో భయాందోళన చెందిన కొందరు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. బెంగుళూరు లోని  మథికెరె ప్రాంతంలో నివసించే ఓ వ్యక్తి ఇంట్లోకి శ్వేతనాగు వెళ్లింది. పాము రాకను గమనించిన కుటుంబ సభ్యులు భయంతో బయటకు వచ్చేశారు. అనంతరం అధికారులకు సమాచారం ఇవ్వగా వారు పాములు పట్టే రాజేశ్ కుమార్‌కి సమాచారం ఇచ్చారు. అతడు వచ్చి చూశాడు. ఫోన్ చేస్తే మామూలు పాము అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చి చూస్తే తెలిసింది అది అరుదుగా కనింపించే శ్వేత నాగు అని అన్నాడు. ఇలాంటి పాములను ఇప్పటి వరకు దేశంలో 8 మాత్రమే గుర్తించినట్లు రాజేశ్ తెలియజేశారు.

English Title
first-rare-albino-cobra-rescued-in-bengaluru

MORE FROM AUTHOR

RELATED ARTICLES