తొలిసారిగా హిజ్రాకు డ్రైవింగ్ లైసెన్స్ !

Submitted by chandram on Tue, 11/27/2018 - 14:58
laila

పాకిస్థాన్ దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా హిజ్రాకు ట్రాఫిక్ అధికారులు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ పొందిన హిజ్రా పేరు లైలా. లైలాకు తన తండ్రి 2000 సంవత్సరంలోనే డ్రైవింగ్ ఎలా చేయాలో నేర్పించడట. లైలా గత పది‍హేను సంవత్సరాల నుండి డ్రైవింగ్ లైసెనస్ లేకుండా వాహనం నడుపుతుందని అధికారులు వెల్లడించారు. అన్ని ఆచరణాత్మక డ్రైవింగ్ పరీక్షలను నిర్వహించిన తరువాత లైసెన్స్ జారీ చేయబడిందని అధికారులు వెల్లడించారు. ఇది ఫెడరల్ రాజధానిలో మొదటిసారి. లింగమార్పిడి వ్యక్తులకు ఒక డ్రైవింగ్ లైసెన్స్‌ను పోలీసు అధికారులు మీడియాకు విడుదల చేశారు. హిజ్రా ఆలీ లైలా మాట్లాడుతూ నేడు లైసెన్స్ పొందడంలో తను చాలా సంతోషంగా ఉందని వ్యక్తం చేశారు. పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆదేశాలపై లైలా 'X' అనే లింకుతో ఒక జాతీయ గుర్తింపు కార్డును జారీ చేసింది. ప్రస్తుతం పాక్‌లో సుమారు 5లక్షల మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నట్లు అంచనా. కాగా పాక్ లో ఎన్నో రకాలు ఇబ్బందులు పడుతున్నామని చివరికి పోలీసుల వల్ల నానారకాల ఇబ్బందులు పడుతున్నామని వివరించారు.

English Title
First Pakistani transgender woman issued a driving license

MORE FROM AUTHOR

RELATED ARTICLES