వ్యభిచార రాకెట్ గుట్టు రట్టు...విటులుగా ముగ్గురు ఎమ్మెల్యేలు

Submitted by arun on Sat, 08/11/2018 - 11:43
Assam Sex Scandal

వారు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు. ప్రజా సేవ చేయడానికి ప్రజలు వారిని తమ ప్రతినిధులుగా ఎన్నుకున్నారు. కానీ వారు ప్రజా సేవను మరిచి నీఛమైన పనులకు పాల్పడుతూ ఎమ్మెల్యే పదవికున్న పేరుతో పాటు అప్పటివరకు సంపాదించుకున్న పరువును మంటల్లో కలిపారు. ముగ్గురు ఎమ్మెల్యేలు వ్యభిచార ముఠాలతో సంబంధాలు ఏర్పర్చుకుని వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్న సంఘటన అసోంలో బైటపడింది. సిల్చార్ పట్టణంలోని మేహర్ పూర్ ప్రాంతంలోని విహార్ లైన్ లో గుట్టుగా సాగుతున్న వ్యభిచార రాకెట్ గుట్టును పోలీసులు గుట్టు రట్టు చేసి ఇద్దరు వ్యభిచారిణులను అరెస్ట్ చేశారు. ఈ వ్యభిచార రాకెట్ వెనుక బీజేపీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులు, ఏఐయూడీఎఫ్ కు చెందిన మరో ఎమ్మెల్యే పాత్ర ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు బీజేపీ ఎమ్మెల్యేలు అమీనుల్ హఖ్ లస్కర్, కిషోర్ నాథ్, ఏఐయూడీఎఫ్ కు చెందిన నిజాముద్దీన్ చౌదరిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యభిచార రాకెట్ లో ఎమ్మెల్యేలతోపాటు కొందరు అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, న్యాయవాదుల పాత్ర కూడా ఉందని పోలీసులు చెపుతున్నారు. వ్యభిచారిణులను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టామని, ఈ వ్యభిచార రాకెట్ కేసులో ముగ్గురు ఎమ్మెల్యేలను విటులుగా పేర్కొంటూ కేసు నమోదు చేశామని కచార్ ఎస్పీ రాకేష్ రౌషన్ వెల్లడించారు. కాగా వ్యభిచార రాకెట్ తో తనకు సంబంధం లేదని, దీనిపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు.
 

English Title
FIRs name 3 Assam MLAs in sex scandal

MORE FROM AUTHOR

RELATED ARTICLES