నిప్పు లేకుండానే మంటలు...దయ్యమే కారణమంటున్న గ్రామస్తులు

x
Highlights

అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం చండ్రాయని పల్లి గ్రామంలో నిప్పు లేకపోయినా మంటలు చెలరేగుతున్నాయి. గ్రామానికి చెందిన ముగ్గురు అన్నదమ్ముల ఇళ్లలో ఉదయం,...

అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం చండ్రాయని పల్లి గ్రామంలో నిప్పు లేకపోయినా మంటలు చెలరేగుతున్నాయి. గ్రామానికి చెందిన ముగ్గురు అన్నదమ్ముల ఇళ్లలో ఉదయం, సాయంత్రం ఉన్నట్టుండి మంటలు రేగుతున్నాయి. మూడు నెలులగా ఇంట్లోని సర్వస్వం బూడిద అవుతున్న ఈ మంటలు ఆగడం లేదు. వీటి బారినుంచి తప్పించుకోవడం ఎలాగో తెలియక పిల్లాపెద్దలు నిత్యం జాగారం చేస్తున్నారు.

గ్రామానికి చెందిన తిరుపాల్‌,శేఖర్‌, చెన్నుడు ముగ్గురు అన్నదమ్ములు. వీరంతా ఒకే చోట ఇళ్లు కట్టుకుని వేర్వేరుగా జీవిస్తున్నారు. అయితే మూడు నెలల క్రితం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. తొలుత ప్రమాదవశాత్తుగా భావించిన అన్నదమ్ములు లైట్‌గా తీసుకున్నారు. తరువాత మరో ఇద్దరి ఇళ్లలో మంటలు రావడంతో ఏదో జరుగుతుందని నిర్ధారణకు వచ్చారు. తరువాత రెండు మూడు రోజులకోసారి ఉదయం, సాయంత్రం మంటలు రావడం ఏం జరుగుతుందో తెలియని పడుతున్నారు. నిత్యావసరాల వస్తువులు, బట్టలు, పిల్లల పుస్తకాలు కాలి బూడిద కావడంతో ఉన్న కొద్దిపాటి సామాగ్రితో ఇంటి ఆవరణలోనే ఉంటున్నారు.

మంటలు ఎలా వస్తున్నాయో తెలుసుకునేందుకు గ్రామస్తులతో కలిసి పలు ప్రయత్నాలు చేసినా ఎలాంటి ప్రయోజనం కలగలేదు. రెండు రోజుల క్రితం పంట సాగు కోసం రెండున్నర లక్షల రూపాయలు తెచ్చి బీరువాలో భద్రపరిచారు. రాత్రికి రాత్రి ఉన్నట్టుండి బీరువాలో మంటలు చెలరేగి నగదుతో పాటు విలువైన బట్టలు కాలి బూడిదయ్యాయి. దీంతో తమ ఇంట్లో దయ్యం తిరుగుతోందని దీని వల్ల నిత్యం మంటలు చెలరేగి నష్టపోతున్నామంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మంటలు ఎలా వస్తున్నాయో తెలుసుకునేందుకు గ్రామ సర్పంచ్‌తో పాటు పలువురు స్ధానికులు ఇంట్లోనే ఉండగానే కళ్లెదుట మంటలు చెలరేగడంతో అవాక్కయ్యారు. ఇళ్లు ఖాళీ చేయమంటూ చెప్పి వెళ్లిపోయారు. వారం క్రితం పెద్ద సోదరుడి కుమార్తె పాఠశాలకు వెళ్లగా అక్కడ బాలికకు మంటలు అంటుకున్నాయి. దీంతో బడికి కూడా ఇంటికి దగ్గరే ఉండాల్సి వస్తోందని బాలిక ఆవేదన వ్యక్తం చేస్తోంద.

మంటల కారణంగా ఇంట్లో కాలు పెట్టాలంటేనే భయపడాల్సి వస్తోందని బాధిత మహిళలు అంటున్నారు. మూడు నెలలుగా కంటిమీద కునుకు కరువయ్యిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కట్టుబట్టలు తప్ప మిగిలేదంటున్న కన్నీరు పెట్టుకుంటున్నారు. గ్రామస్తులు మాత్రం ఇదంతా దయ్యాల పనేనంటూ ప్రచారం చేస్తూ ఉండటంతో ఇటు వైపు కన్నెత్తి చూసే వారు కూడా కరువయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories