బిగ్‌బాస్‌ హౌస్‌లో భారీ అగ్ని ప్రమాదం

Submitted by arun on Thu, 02/22/2018 - 14:23
bigboos

దేశవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పాపులర్‌ అయిన బిగ్‌బాస్‌ రియాలిటీ షోకు సంబంధించిన హౌస్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు నగర శివారు బిదాడిలోని ఇన్నోవేటివ్‌ ఫిల్మ్‌ సిటీలో నిర్మించిన కన్నడ బిగ్‌బాస్‌ హౌస్ సగానికి పైగా కాలిపోయింది. షాట్‌సర్య్కూట్‌ వల్లే ప్రమాదం సంభవించి ఉంటుందని నిర్వాహకులు భావిస్తున్నారు. బిగ్‌ బాస్‌ సీజన్‌ 5 కోసం బిదాడిలోని ఇన్నోవేటివ్‌ ఫిల్మ్‌ సిటీలో బిగ్‌ బాస్‌ హౌజ్‌ కోసం స్పెషల్‌ సెట్‌ వేశారు. గత నెల చివర్లో సీజన్‌ ముగిసింది కూడా. ఈ క్రమంలో ఈ ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే రామానగర్‌, చన్నపట్న నుంచి అగ్ని మాపక దళాలు ఘటనా స్థలానికి వచ్చాయి. మంటలను ఆర్పేందుకు ఐదు గంటలకు పైగా సమయం పట్టినట్లు తెలుస్తోంది. 

ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించలేదని.. ఆస్తి నష్టం మాత్రమే జరిగిందని షో నిర్వాహకులు తెలిపారు. షార్ట్‌ సర్క్యూట్‌ తోనే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కన్నడ స్టార్‌ హీరో సుదీప్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో 5వ సీజన్‌లో చందన్‌ శెట్టి విజేతగా నిలిచాడు.

English Title
fire accident kannada bigg boss house

MORE FROM AUTHOR

RELATED ARTICLES