ఈనెల 21 న 2జీ స్పెక్ట్రమ్ కేసుపై తుది తీర్పు..!

Highlights

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిచిన 2జీ స్పెక్ట్రమ్ కేసులో పాటియాలా కోర్టు ఈనెల 21వ తేదీన తుది తీర్పును వెల్లడించనున్నది. ఈ విషయాన్ని ఇవాళ ఢిల్లీలోని...

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిచిన 2జీ స్పెక్ట్రమ్ కేసులో పాటియాలా కోర్టు ఈనెల 21వ తేదీన తుది తీర్పును వెల్లడించనున్నది. ఈ విషయాన్ని ఇవాళ ఢిల్లీలోని పాటియాలా కోర్టు తన తీర్పులో పేర్కొన్నది. కాగా ఇవాళ ఈ కేసు నిమిత్తం ఎంపీ కనిమొళి కోర్టు విచారణకు హాజరయ్యారు. 2జీ స్పెక్ట్రమ్ కేసులో ఆమె నిందితురాలిగా ఉన్నారు. తుది తీర్పు కోసం డిసెంబర్ 21 వరకు వేచి చూద్దామని ఆమె ఈ సందర్భంగా అన్నారు. గతంలో అనేక సార్లు ఈ కేసు వాయిదా పడింది. నవంబర్ 7వ తేదీన చివరి విచారణ జరిగింది.

రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలకు సంబంధం ఉన్న మూడు ప్రధాన స్పెక్ట్రమ్ కేసుల్లో సీబీఐ కోర్టు తన తీర్పును వెల్లడించాల్సి ఉంది. వాస్తవానికి గత అక్టోబర్ 25వ తేదీన ఈ కేసులో సీబీఐ కోర్టు తీర్పును ఇవ్వాల్సి ఉండగా, డాక్యుమెంట్లు ఎక్కువగా ఉన్న కారణంగా నవంబర్ 7వ తేదీకి కేసును వాయిదా వేశారు. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై సీబీఐ రెండు కేసులు నమోదు చేయగా, ఈడీ మరో కేసును వేసింది. మాజీ టెలికాంశాఖ మంత్రి ఏ.రాజా, ఎంపీ కనిమొళిలు ఆ కేసు ఛార్జ్‌షీట్‌లో ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories