చికిత్స పొందుతూ ప్రముఖ నిర్మాత కన్నుమూత...

Submitted by arun on Mon, 08/06/2018 - 15:54
flm

కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి మాజీ అధ్యక్షుడు, ప్రముఖ కన్నడ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఎం.భక్తవత్సలం ఆదివారం కన్నమూశారు. బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదివ్వాస విడిచారు. ‘సంపూర్ణ రామాయణం’(1971) చిత్రంతో భక్తవత్సలం నిర్మాతగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అనంతరం బీవీ కారంత్ నటించిన ‘కన్నమేశ్వర రామ’తో పాటు పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.
 
కన్నడ సినిమా రంగం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు భక్తవత్సలం. సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా, ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఎంపికైన అతి చిన్న వయస్కుడిగా ఆయన రికార్డు సాధించారు. అలాగే బెంగళూరులో శారద, మినర్వ, లావణ్య, మైసూర్ లోని లక్ష్మీ సినిమా టాకీస్ లున్నాయి. ఈ సందర్భంగా కన్న చలనచిత్ర వాణిజ్యమండలి అధ్యక్షుడు చెన్నేగౌడ సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ దర్శక, నిర్మాతలు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు.

English Title
Film producer Bhaktavatsala no more

MORE FROM AUTHOR

RELATED ARTICLES