భర్తకు కూతురితో పెళ్లి చేసిన భార్య

Submitted by arun on Thu, 07/05/2018 - 12:47
marraige

వావివరసలు మరిచిన ఓ తండ్రి కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న కూతిరినే పెళ్లాడాడు. అంతేకాకుండా ఆమెను గర్భవతిని కూడా చేశాడు. అయితే తనకు అల్లా ఆదేశించడం వల్లే ఇలా చేశానని ఇందులో తన తప్పేమి లేదని గర్వంగా చెబుతున్నాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని జల్పాయ్ గురి జిల్లాలో చోటుచేసుకుంది.

జల్పాయ్‌గురి జిల్లాలోని కసియాజోరా గ్రామానికి చెందిన 36ఏళ్ల అఫాజుద్దీన్ అలీ ఈ దారుణానికి ఒడిగట్టాడు. అల్లా ఆదేశమంటూ ఆరు నెలల క్రితం తన 15 ఏళ్ల కూతురిని వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లి విషయంలో భార్య సకీనా పూర్తి మద్దతు తెలిపింది. తమ బిడ్డ మంచి కోసమే ఇలా చేస్తున్నానని చెప్పడంతో సకీనా సరేనంది. ఈ విషయం మొదట్లో గ్రామస్థులకు ఎవరికీ తెలియదు. ఆమెను ఎప్పుడూ ఇంట్లోనే ఉంచడంతో అసలు విషయం తెలియకుండా పోయింది. కొన్ని రోజులుగా శరీరంలో మార్పులు గమనించిన కొద్దిమంది దీనిపై ఆరాతీయడంతో కథ పోలీస్ స్టేషన్‌కు చేరింది. అఫాజుద్దీన్ అలీని అరెస్ట్ చేసిన పోలీసులు.. సోమవారం కోర్టుముందు హాజరుపరిచారు. ఇలా కన్న కూతురిని గర్భవతిని చేసిన తండ్రి కేసు స్థానికంగా సంచలనం సృష్టించింది. మూడనమ్మకాలతో కన్న కూతురిపై దారుణానికి ఒడిగట్టిన అఫాజుద్దిన్ ను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 


 

English Title
father marries daughter

MORE FROM AUTHOR

RELATED ARTICLES