భార్య కాపురానికి రావడం లేదంటూ దారుణం....

Submitted by arun on Mon, 08/06/2018 - 10:43

ఓ కసాయి తండ్రి కర్కశత్వానికి అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులు బలయ్యారు.
 హాయిగా అమ్మ ఒడిలో నిద్రపోవాల్సిన పదినెలల పసికందుతో పాటు ఇద్దరు చిన్న పిల్లలు చిత్తూరు జిల్లా నీవా నదిలో శవాలై తేలారు. గంగాధర నెల్లూరు మండలం బాలవెంగనపల్లెకు చెందిన వెంకటేష్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. భార్య కాపురానికి రావడం లేదనే ఆగ్రహంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. భార్య అమరతో వెంకటేష్ గొడవపడ్డాడు. క్షణిక ఆవేశంలో ఇంట్లో నిద్రిస్తున్న పది నెలల బాబు పునీత్, సంజయ్ , రాహుల్ ను  స్వగ్రామానికి తీసుకొచ్చాడు. చిన్న పిల్లలు అనే దయ కూడా లేకుండా ముగ్గురు కుమారులను నీవా నదిలో పడేశాడు. కాసేపటికి చిన్నారుల శవాలు నీటిలో తేలాయి. గ్రామస్తుల సమాచారంతో పోలీసులు ఘటనస్థలికి వచ్చారు. మృతదేహాలను వెలికితీశారు. మృతుల బంధువులు కన్నీరుమున్నీరుగా రోధిస్తున్నారు. 

English Title
father killed his three children

MORE FROM AUTHOR

RELATED ARTICLES