కడప జిల్లాలో సాగునీటి శాఖలో అంతులేని అవినీతి భాగోతం

x
Highlights

సాగునీటి శాఖ అధికారుల అవినీతి, అలసత్వం వెరసి కరువు జిల్లా కడప రైతులను కష్టాల్లోకి నెట్టింది అసలు వర్షాబావ పరిస్థితులు, ఎండకు ఎండిపోతున్న పంటలు అడుగంటి...

సాగునీటి శాఖ అధికారుల అవినీతి, అలసత్వం వెరసి కరువు జిల్లా కడప రైతులను కష్టాల్లోకి నెట్టింది అసలు వర్షాబావ పరిస్థితులు, ఎండకు ఎండిపోతున్న పంటలు అడుగంటి పోయిన నీటి నిల్వలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతన్నలు సగిలేరు ప్రాజెక్టులోకి చేరిన నీటిని చూసి సంబర పడ్డారు ఇంతలోనే అధికారుల నిర్లక్ష్యంతో కారణంగా రైతుల ఆశలు గల్లంతయ్యాయి.

కడప జిల్లాలోని బద్వేలు ప్రాంతం ప్రతి యేటా సాగునీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల తాగు సాగు అవసరాలను తీర్చేందుకు బి. కోడూరు మండలంలో సగిలేరు జలాశయాన్ని నిర్మించారు. ఈ ప్రాజెక్టు‌ నిర్మాణంలోనే భారీ అవినీతి జరిగినట్లు అప్పట్లో వార్తలు ఉన్నాయి. ఇక జలాశయం కట్టిన నాటి నుంచి భద్రతపై అనేక అనుమానాలు ఉన్నాయి. దీంతో 50 లక్షల వ్యయంతో ఐదు గేట్లను మరమ్మతులు చేయించారు అధికారులు. అయితే కాంట్రాక్టర్లు పనులను అత్యంత నాసిరంకంగా పనులు చేయడం అధికారుల నిర్లక్ష్యంతో మరోసారి ప్రాజెక్టులో జరిగిన అవినీతి బయట పడింది. తెలుగుగంగ ద్వారా ప్రాజెక్టులోకి నీరు రావడంతో ఒత్తిడి తట్టుకోలేక రెండు గేట్లు కొట్టుకు పోయాయి.

సగిలేరు ప్రాజెక్టు లోని నీటిని బద్వేలు, మైదుకూరు నియోజికవర్గాల్లోని 36 చెరువుల కింద ఉన్న ఆయకట్టుకు, బద్వేల్ పట్టణ దాహార్దిని తీర్చేందుకు అందించాలి. గత కొన్నేళ్లగా ప్రాజెక్టులోకి చేరకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డ రైతన్నలు ఈ ఏడాది బ్రహ్మంసాగర్ జలాశయంలోకి వచ్చిన కృష్ణా జలాలోంచి 0.115 ఎంసీఎఫ్ నీటిని సరిలేరు జలాశయానికి తరలించారు. దీంతో ఐదు వేల ఎకరాల పంట సాగుకు సరిపోతుందని అందరూ భావించారు.అయితే గేటు కొట్టుకు పోవడంతో సాగు, తాగునీటి అవసరాలు తీరని పరిస్థితి నెలకొంది. ఇదే నీరు చెరువులకు పంపించి ఉంటే రెండు కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులు రైతులకు దక్కేవని రైతులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు భూగర్భ జలాలు పెరిగి తాగునీటి అవసరాలకు నీరందేదని రైతులు చెబుతున్నారు.

సగిలేరు జలాశయం గేట్లు కొట్టుకు పోవడానికి అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని రైతులు చెబుతున్నారు, ఇక గేట్లు, ఆనకట్ట పటిష్టంగా ఉన్నాదో లేదో అన్న ప్రాధమిక అంశాన్ని అధికారులు విస్మరించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..ఇటీవల 50 లక్షలతో ఐదు గేట్లకు 10 చైనులు కొత్తగా ఏర్పాటు చేసినా వాటిని అమర్చక పోవడం పాతవాటితోనే సరిపెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంజినీరింగు అధికారుల పర్యవేక్షణ కొరవడం వల్లే అత్యంత నాసిరకంగా పనులు చేశారన్న విమర్శలు తీవ్రస్థాయిలో వ్యక్తమవుతున్నాయి.మొత్తానికి ప్రాజెక్టు నిర్మించిన దగ్గర నుంచి సగిలేరుకు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది... ప్రాజెక్టు కోసం భారీగా నిధులు ఖర్చు చేసినా అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా పంటలకు అందాల్సిన నీరు సముద్రం పాలయ్యింది దీంతో రైతులు దిక్కు తోచని స్థితిలోకి వెళ్లారు.

Show Full Article
Print Article
Next Story
More Stories