కిలో ఉల్లి 50 పైసలు.. రైతుల శాపాలు

కిలో ఉల్లి 50 పైసలు.. రైతుల శాపాలు
x
Highlights

సామాన్య ప్రజానీకాన్ని ఉల్లి ఎంత అవసరమో తెలియనిది కాదు. ఏ వంటకంలోనైన ఉల్లి తప్పనిసరిగా వాడాల్సిందే. బిర్యానీ తినాలన్న ప్రక్కకు ఉల్లి సాలడ్ లేందే ముద్ద...

సామాన్య ప్రజానీకాన్ని ఉల్లి ఎంత అవసరమో తెలియనిది కాదు. ఏ వంటకంలోనైన ఉల్లి తప్పనిసరిగా వాడాల్సిందే. బిర్యానీ తినాలన్న ప్రక్కకు ఉల్లి సాలడ్ లేందే ముద్ద దిగాదు. అలాంటిది ఉల్లిగడ్డను పండించే రైతులకు మాత్రం కంటినిండా కన్నీళ్లే మిగులుతున్నాయి. కనీసం పంటకు పెట్టిన పెట్టుబడి కూడా చేతికి తిరిగిరాని ధీనస్థితిలో ఉల్లి రైతులు దిక్కుతొచని స్థితిలో ఉన్నాయి. ఇక నాసిక్‌లో అయితే కిలో ఉల్లి ధర 50పైసలు దాటడం లేదు. కష్టపడి క్వింటల్ లెక్కచూసిన సాగుకు 1,100 రూపాయలు పెట్టుబడి పెడితే తీర మార్కెట్్లో విక్రయిస్తే కేవలం రూ.400 వచ్చాయని గగ్గోలు పెడుతున్నాడు ఓ రైతు. ఇక మధ్యప్రదేశ్‌లోనూ ఇదే దుస్థితి నెలకొంది. పండించిన ఉల్లిరైతుల నుండి కిలో 50పైసలకు కొనుగొలు చేస్తూంటే తీరా మార్కేట్లోకి వచ్చేసరికి వినియోగదారులకు రూ. 20 వరకు పలుకుతుంది. ఇకనైనా ప్రభుత్వం చలించి తమ గోడును పట్టించుకోని కనీస మద్దతు ధర కల్పించాలని ఉల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories